-
-
Home » Telangana » Mahbubnagar » Quick solution to problems-MRGS-Telangana
-
సమస్యలకు సత్వర పరిష్కారం
ABN , First Publish Date - 2022-09-20T04:38:38+05:30 IST
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టరేట్ ఏవో యాదగిరి అన్నారు.

- కలెక్టరేట్ ఏవో యాదగిరి
- ప్రజావాణి కార్యక్రమానికి 34 ఫిర్యాదులు
గద్వాల క్రైం, సెప్టెంబరు 19 : ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టరేట్ ఏవో యాదగిరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 34 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ధరణి సమస్యలకు సంబంధించి 29, ఇతర సమస్యలకు సంబంధించి అయిదు ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజు, మదన్‌మోహన్, జిల్లా అధికారులు ఉన్నారు.