-
-
Home » Telangana » Mahbubnagar » Push the steel foot on antisocial activities-NGTS-Telangana
-
సంఘ వ్యతిరేక చర్యలపై ఉక్కుపాదం మోపండి
ABN , First Publish Date - 2022-03-16T05:42:58+05:30 IST
సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల ని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు.

- నేర సమీక్షలో ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్‌నగర్, మార్చి 15 : సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల ని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నేరసమీక్షలో ఎస్పీ మాట్లాడారు. శాంతిబద్రతలకు విఘాతం కలిగించే వారిపై, నేరచరిత్ర ఉన్నవారిపై నిఘా ఉంచాలని సూచించారు. భూతగదాల విషయంలో పోలీసుల పరిధి తక్కువ అన్న విషయాన్ని గుర్తించాలని, గొడవలు జరిగే సమయంలో మాత్రం పోలీసులు తమ పాత్ర పోషించాలని పేర్కొన్నారు. నేరగాళ్లకు శిక్షపడేలా విచారణ జరగాలని అవస రమైతే సీనియర్ల సలహాలు తీసుకోవాలని చెప్పారు. స్టేషన్‌లలో పెండింగ్ కేసులు లేకుండా చూసుకోవాలని అన్నారు. నిషేదిత మత్తు పదార్థాల వ్యాపారం, అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని తెలిపారు, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాదితులతో రిసెప్షన్ మొదలు విచారణ అధికారి వరకు సున్నితంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కోర్టు డ్యూటీ అధికారుల పనితీ రును నిత్యం సమీక్షించుకుంటూ నేరగాళ్లకు శిక్షపడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్య క్రమంలో అడిషినల్ ఎస్పీ ఎ రాములు, డీఎస్పీ కిషన్ పాల్గొన్నారు.