ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-08-31T05:43:17+05:30 IST

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అయిజలో లబ్ధిదారుకు పెన్షన్‌ కార్డును అందిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

- లబ్ధిదారులకు పింఛన్‌ కార్డుల పంపిణీ

అయిజ టౌన్‌, ఆగస్టు 30 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్‌ హాల్‌లో మంగళ వారం నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్‌ దేవన్నతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్‌ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. అయిజ మునిసిపాలిటీలో 57 సంవత్సరాల నిండిన వారు 265, వితంతువులు 112, వికలాంగులు 64, ఒంటరి మహిళలు 11, 65 సంవత్స రాలు నిండిన వారు 11, గీత కార్మికులు ముగ్గురు, చేనేత కార్మికులు ఇద్దరికి, మొత్తంగా 468 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. మునిసిపాలిటీలో అత్యధి కంగా ఒకటి, 17వ వార్డుల్లో 41 మందికి, అతి తక్కువగా 18వ వార్డులో ఆరుగురికి పింఛన్లు వచ్చాయి. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు, కమిషనర్‌ నర్సయ్య, ఏఈ గోపాల్‌, మేనేజర్‌ రాజేష్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

అయిజ : విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తనూర్‌ గ్రామంలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ నాయ కుడు గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల స్థాయి క్రీడలు ముగిశాయి. ఈ సందర్భంగా మంగళ వారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్రహాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి, సుందర్‌రాజ్‌, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు రాముడు తదితరులు పాల్గొన్నారు.


క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని టీఆర్‌ ఎస్‌ నాయకుడు గౌతమ్‌రెడ్డి అన్నారు. ఽఉత్తనూర్‌ గ్రామంలో నిర్వహించిన క్రీడా పోటీలకు రెండవ రోజు మంగళవారం గౌతమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి, దివంగత నాయకుడు తిర్మల్‌రెడ్డి ఆశయ సాధనలో భాగంగా అందరి సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు సీతారామ్‌రెడ్డి, సుందర్‌రాజ్‌, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు రాముడు, టీఆర్‌ఎస్‌ నాయకులు మేకల శ్రీనివాసులు, వెంకటేశ్వర్‌రెడ్డి, మాణిక్యం, విజయ్‌, రమేష్‌, బెంజిమెన్‌, ఉమేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Read more