-
-
Home » Telangana » Mahbubnagar » Public welfare is the goal-MRGS-Telangana
-
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ABN , First Publish Date - 2022-09-18T05:02:51+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక ప థకాలు రూపొందించి అమలు చేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

- పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం
- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
- జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ
- పాల్గొన్న ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ హరిచందన, ఎస్పీ వెంకటేశ్వర్లు
- ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
నారాయణపేట టౌన్, సెప్టెంబరు 17 : టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక ప థకాలు రూపొందించి అమలు చేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాక ఆవిష్కరణలో ఆమె పాల్గొ ని పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులచే వందనం స్వీకరించి మాట్లాడారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ స్వతం త్రంగా ఉండేందుకు ఇష్టపడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణాలోని అప్పటి ఎనిమిది జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కలిసి ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశాయన్నారు. కానీ ప్రజలకు మాత్రం భారతదేశంలో కలవాలని ఉండిందని దీంతో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై పోరాటం చేసి 1948 సెప్టెంబరు 17న తెలంగాణ గడ్డపై జాతీయ జెండా రెపరెపలాడిందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకొని తెలంగాణ సమైక్య భార తదేశంలో విలీనమై 74 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మూడురోజుల పాటు నిర్వహించు కుంటున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ఆమె వివరించారు. ఆంధ్రప్ర దేశ్‌లో విలీనమైన తెలంగాణాను ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జాతీయ స్థా యిలో అవార్డులు సాధిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తోం దన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం హరిత తెలంగాణ, స్వర్ణ తెలంగాణ, జలసిరుల తెలంగాణ వైపు కదులుతోందన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగ గా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, నారాయణపేట చేనేత వస్ర్తాలకు ప్రసిద్ధి చెందిందని జిల్లా కేంద్రంగా ప్రకటించారన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయ ని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా రాష్ట్రం దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు. ఆసర పింఛన్లో వృద్ధాప్య, వితంతువు, చేనేత, కల్లు, గీత, బీడీ, ఓంటరి, ఎయిడ్స్ బాధితులకు ఇలా మొత్తం 69,357 ఆసరా పింఛన్‌దారులకు రూ.16.32 కోట్లు మం జూరు చేశామన్నారు. ఆగస్టు 15న నాటికి అదనంగా 13,476 పింఛన్లు మంజూరు చేశామ న్నారు. క్రీడాప్రాం గణం కోసం 327 గ్రామాల్లో స్థలాలు గుర్తించామని ఇ ప్పటి వరకు 156 గ్రామాల్లో పనులు పూర్తి చేశామ న్నారు. వీటిలో 45 పనులు పురోగతిలో ఉండగా ప్రతీ గ్రామంలో ఎకరం చొప్పున క్రీడా ప్రాంగణం కల్గి ఉం దన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరా నికి 6,817 స్వయం సహాయక సంఘాలకు రూ.230.16 కోట్ల రుణాలు లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 1,314 సంఘాలకు రూ.68.99 కోట్లు రుణాలు మంజూరు చేశామ న్నారు. రైతుబంధు పథకం కింద 1,73,237 మంది రైతులకు రూ.1,54,101 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, రైతుబంధు పథకంలో 9,462 మంది ఎస్టీ రైతులకు రూ.89.04 కోట్లు పంపిణీ చేశామన్నారు. రైతు బీమా ద్వారా 11,15,763 మంది రైతుల పేర్లను నమోదు చేసి అర్హులుగా గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 2,901 రైతు ల కుటుంబాలకు ఐదు లక్షల రూపాలయల చొప్పున మొత్తం రూ.145.05 కోట్లు నామినీ ఖాతాల్లో జమ చేశా మన్నారు. దళితబంధు ద్వారా 183 మందిని గుర్తించి యూనిట్లను మంజూరు చేశామని, భూమి కొనుగోలు పథకం ద్వారా 77 మంది భూమి లేని నిరుపేద హరిజ న మహిళలకు 221.12 ఎకరాల భూమిని పంచామన్నారు. ఇందుకు రూ.709.07 లక్షలు ఖర్చు చేశామన్నారు. జిల్లాలోని మహిళలను ఒకే తాటిపైకి తెచ్చి వారివారి ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ అరుణ్య పేరుతో వ్యాపారా లను నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామని, 1,500 మంది మహిళల ద్వారా వివిధ రకాల ఉత్పత్తులు ఆమెజాన్ ద్వారా ఆన్లైన్లో అమ్మకాలు చేయడం జరుగు తుందన్నారు. జిల్లాలోని 280 పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు జరుగుతున్నాయని, నారాయణపేటలో రూ.50 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. పట్టణ ప్రగతి ద్వారా మాంసహర, మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు, వయోవృద్ధుల ఆశ్రమం, సమీకృత మాంసాహార, శాఖాహార మార్కెట్ నిర్మాణ పనులు, వైకుంఠ ధామం, గ్రంథాలయ భవన నిర్మాణ పనులు, కొండారె డ్డిపల్లి చెరువు, మినీస్టేడియం నిర్మాణం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఎక్లాస్పూర్ ఎకో పార్కులో హరితహరం ద్వారా ఐదు హెక్టార్లలో 20వేల మొక్కలు నాటడం జరిగిందని, ఫెరిఫెరల్ ప్లాంటింగ్ ద్వారా ఐదు కిలో మీటర్లలో పదివేల మొక్కలు నాటామన్నారు. 2019లో ఏర్పడిన నారాయణపేట జిల్లాలో అటవీ ప్రాం తం 3.621 శాతం ఉండగా 2020 -21 వరకు దాదాపు 80 లక్షల మొక్కలు నాటడం ద్వారా వృక్షశాతం 1.6 శాతం పెరిగిందన్నారు. కృష్ణ మండలంలో జింకల పార్కు ను ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా జిల్లాలో 5,187 మంది లబ్ధిదారులకు రూ.51.86 కోట్లు అందించామన్నారు. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.317 టీఎంసీలు కాగా 2.70 టీఎంసీల వరకు నీరు నింపడంతో పాటు సివిల్ పనులు పూర్తి చేశామన్నారు. భూత్పూర్ రిజర్వాయర్ కింద ఈ ఖరీఫ్‌లో 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగ దారులకు ఇప్పటి వరకు 0.95 కోట్ల ద్వారా లబ్ధిపొం దారని, గృహ ఉచిత విద్యుత్ వినియోగ దారులు 0.26 కోట్లతో లబ్ధిపొందారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మే రకు విద్యుత్ సంస్థ తరపున చాకలి, మంగలిలకు ఉచి త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, సూక్ష్మ సేద్య పథకం కింద ఆయిల్ పాం పథకం, డ్రిప్, ఇరిగేషన్ కింద రైతులకు వందశాతం రాయితీపై 414 రైతులకు పరి పాలన మంజూరి ఉత్తర్వులను ఇచ్చామన్నారు. జిల్లాలో 93 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వీటి ద్వారా క్వింటాలుకు రూ.1,960తో 12.35 లక్షల క్వింటాళ్ల వరిని 21,161 మంది రైతుల ద్వారా కొనుగోలు చేశామ న్నారు. మాంస ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ం గొర్రెల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రస్తుతం జిల్లాలో 22,333 సభ్యులతో 214 సంఘాలు ఉండగా, అందులో 9950 లబ్ధిదారులకు 20 గొర్రెలు, ఒ క పొట్టెలు చొప్పున పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని చెరువుల్లో వందశాతం రాయితీపై చేప విత్తనాలు సరఫరా చేసేందుకు 707 ఇరిగేషన్ చెరువులు, రిజర్వా యర్లలో మొత్తం 179.11 లక్షల చేప విత్తనాలు సరఫరా చేశామన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 419 పాఠశాలలో ఆంగ్ల మాద్యమం ప్రారంభించామని, 174 పాఠశాలలను మొదటి విడత గా నవీకరణ చేశామన్నారు. కోటి వ్యయంతో పేటలో వృద్ధ ఆశ్రమం, 540 పాఠశాలలకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ద్వారా మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరి నిర్మిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల నిర్వా హణకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని అభి నందించారు. కలెక్టర్ హరిచందన, ఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో వనజ ఆంజనే యులు, ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి, పుర చైర్పర్సన్ గందె అనసూయ పాల్గొన్నారు.
