ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-12-12T23:15:03+05:30 IST

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి అలుపెరగని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- రైతుబంధు, బీమా, కల్యాణ లక్ష్మి

అద్భుతమైన పథకాలు

- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి

- పలు గ్రామాల్లో అభివృద్ధి

పనులు ప్రారంభం

భూత్పూర్‌, డిసెంబరు 12: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి అలుపెరగని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అన్నాసా గర్‌, కొత్తమొల్గర, భట్టుపల్లి గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా అన్నాసాగర్‌లో గ్రామానికి చెందిన ఆల శ్రీకాంత్‌రెడ్డి రూ.లక్షతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమకూర్చిన డ్యూయల్‌డెస్కు, బీరువాలను ఎమ్మెల్యే అందజే శారు. ఈ సందర్భంగా దాత శ్రీకాంత్‌రెడ్డిని ఆయన అభినందించారు. కొత్తమొల్లర గ్రామ పంచాయతీ వ్యాపార సముదాయాల కాంప్లెక్స్‌ ను స్థానికి సర్పంచ్‌ వెంకటమ్మతో ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా భట్టుపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని ఏవీఆర్‌ కాలనీలో గిరిజన (తండా)లో ఏర్పాటు చేసిన హైమాస్కు లైట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదా రులకు ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ రైతుబంధు, బీమా, కల్యాణ లక్ష్మి అద్భుతమైన పథకాలు అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందివ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్ర ణాళిక తయారు చేస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, మండల రైతుబంధు అధ్యక్షుడు నర్సిములుగౌడ్‌, జిల్లా మత్స్య సహకార సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి సత్యనారాయణ, వైస్‌ ఎంపీపీ నరేష్‌కుమార్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ నారాయణ గౌడ్‌, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్‌, సాయి లు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటయ్య, వివిధ గ్రామాల సర్పంచులు శ్రీనయ్య, భట్టుపల్లి ఆంజనేయులు, యాదయ్య, రాములమ్మ, మునిసిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:15:05+05:30 IST