చివరి శ్వాస వరకు ప్రజాసేవ

ABN , First Publish Date - 2022-07-06T04:58:43+05:30 IST

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు తనపై నమ్మకం ఉంచి జడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారని, చివరి శ్వాస వరకు ప్రజా సేవ లోనే ఉంటానని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

చివరి శ్వాస వరకు ప్రజాసేవ
చైర్‌పర్సన్‌ సరితకు పుష్పగుచ్ఛం అందించి సత్కరిస్తున్న ఉద్యోగులు

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- మూడేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం

గద్వాల, జూలై 5 : సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు తనపై నమ్మకం ఉంచి జడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారని, చివరి శ్వాస వరకు ప్రజా సేవ లోనే ఉంటానని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్త యిన సందర్భంగా మినిస్టీరియల్‌ ఉద్యోగులు మంగళ వారం ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారుల సహకా రంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేశానని, చేస్తూనే ఉంటానని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం నడిగడ్డకు సేవ చేసే అదృష్టం ఒక మహిళకు ఇచ్చినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు అందించే బాధ్యతలో ముందుంటానని తెలిపారు. ఉద్యోగులు, మండల పరిషత్‌ అధికారులు తనకు సహకారం అందిస్తున్నారని, అది ఎప్పటికీ కొనసాగాలని కోరారు. అనంతరం జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ సరోజమ్మ, గద్వాల ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌లను సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయా నాయక్‌, డిప్యూటీ సీఈవో ముసాయిదాబేగం, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 


జడ్పీటీసీ సభ్యురాలికి సన్మానం 

గట్టు : జడ్పీటీసీ సభ్యురాలిగా భాద్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు దాటిన సందర్భంగా గట్టు జడ్పీటీసీ సభ్యురాలు బాసు శ్యామల, సర్పంచ్‌ల సం ఘం మండల అద్యక్షుడు హనుమంతు నాయుడు లను మంగళవారం బల్గెర గ్రామంలో ఘనంగా సన్మా నించారు. టీఅర్‌ఎస్‌ నాయకులు, పంచాయతీ కార్య దర్శులు వారికి పూల మొక్కలు అందించి శుభా కాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టి ప్రజల మన్ననలను పొందాలని ఆకాంక్షించారు.

Read more