ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-27T23:25:00+05:30 IST

పేద ప్రజల ఆరోగ్యం కోస మే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- ఉలిగేపల్లి, మద్దెలబండ గ్రామాల్లో పల్లె దవాఖానాలు ప్రారంభం

మల్దకల్‌, నవంబరు 27: పేద ప్రజల ఆరోగ్యం కోస మే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలం లోని ఉలిగేపల్లి, మద్దెలబండ గ్రామాల్లో రూ.16లక్షల తో నిర్మించిన పల్లె దవాఖానాలను ఎమ్మెల్యే ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రజలు పట్టణంలోని ప్రభుత్వ ఆస్ప త్రికి వెళ్లి వైద్యం చేయించుకునే వారని, కానీ తెలం గాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామీణ ప్రాం తాల వారికి కూడా అందుబాటులో వైద్యసేవలు అం దించాలనే లక్ష్యంతో పల్లె దవాఖానాలను ప్రారంభిస్తు న్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మెరుగైన వైద్యం కోసం దూరప్రాం తాలకు వెళ్లకుండా స్థానికంగా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్‌స్థాయిలో వైద్యసేవలు అం దించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ప్రజలంద రూ ఆరోగ్య తెలంగాణ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మద్దెలబండ గ్రామపంచాయ తీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాపార సముదా యాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబురామన్‌గౌడ, ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌, వైస్‌ఎంపీపీలు వీరన్న, సుదర్శన్‌రెడ్డి, సర్పంచులు చిన్నరాములు, జయమ్మ, ఎంపీటీసీ సభ్యులు పెద్ద సవారన్న, గోపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటన్న, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెం కటేశ్వ ర్‌ రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధు సూదన్‌, మండల అధ్యక్షుడు వెంకటన్న, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు సహాయ గుణం ఉండాలి

ధరూర్‌: ప్రతీ ఒక్కరు సహాయ గుణం కలిగి ఉండాలని, అదేవిధంగా తమకు తోచిన సహాయం చేస్తూ ఉండాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహ న్‌రెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ పాఠశాల స్థలదాత కీ.శే. గాండ్ల రామలిం గప్ప, డీఆర్‌ వీరప్ప గార్ల విగ్రహాలను కుటుంబ సభ్యు లు డీఆర్‌. శ్రీధర్‌, డీఆర్‌ విజయ్‌కుమార్‌, శివలీల, బసవరాజుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దానం చేయడానికి ఎంతో ఉదారత కలిగి ఉండాలన్నారు. ఆ మహనీయులు దూరదృష్టితో పాఠశాల కోసం ఎంతో విలువైన స్థలాన్ని విరాళంగా ఇవ్వడం చాలా గర్వకా రణమన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జం బురామన్‌గౌడ, ఎంపీపీ నజీమున్నీసాబేగం, జడ్పీటీసీ సభ్యురాలు పద్మవెంకటేశ్వర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు శివలీల, సర్పంచు పద్మ మ్మ, మండల అధ్యక్షుడు డీఆర్‌ విజయ్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, జాకీర్‌, సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:25:03+05:30 IST