తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన

ABN , First Publish Date - 2022-03-06T04:57:46+05:30 IST

రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లతో పాటు స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన
తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న ప్రజాపంథా నాయకులు

- అర్హులందరికీ పింఛన్లు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి

- ప్రజాపంథా నాయకుల డిమాండ్‌

ఊట్కూర్‌, మార్చి 5 : రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లతో పాటు స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డివిజన్‌ నాయకులు చెన్నప్ప, మల్లెష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇండ్లు పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రజలకు మోసం చేస్తోందన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇస్తామని చెప్పి ఇప్పటికీ గ్రామాల్లో ఏ ఒక్కరికీ కూడా ఇండ్లు ఇవ్వలేదన్నారు. స్థలం ఉంటె ఇండ్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. వెంటనే పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ఇంట్లో ఎంత మంది ఉన్న అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ పింఛన్‌ ఇవ్వాలన్నారు. సొంత స్థలం కలిగిన వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని, నూతనంగా రేష న్‌ కార్డులను జారీ చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ తిరుపతయ్యకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పీవైఎల్‌ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్‌, ఉపాధ్యక్షుడు సిద్దు, నాయకులు నర్సిములు పాల్గొన్నారు.

డీటీకి వినతి పత్రం అందజేత

మక్తల్‌ : నివాస స్థలం ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలని కోరుతూ సీపీఐ ఎంఎల్‌ ప్రజా పంథా నాయకులు శనివారం డీటీ కాళప్పకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు భగవంతు, ఏజీ బుట్టో మాట్లాడుతూ ఆసరా పింఛన్ల కోసం 57ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నాయని, వారికి పింఛన్లు మంజూరుతో పాటు ఇండ్ల నిర్మాణానికి పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు భాస్కర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌, సహాయ కార్యదర్శి హన్మంతు, నాయ కులు రాజు, మారెప్ప, దేవప్ప, నర్సిములు, హబీబ్‌, శేఖర్‌, బాలప్ప పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-06T04:57:46+05:30 IST