ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-09-22T04:32:10+05:30 IST

కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరింది. పీసీసీ సభ్యుల ఎన్నిక పూర్తవ గా, పీసీసీ కార్యవర్గ పదవులు, రాష్ట్రం నుంచి ఏఐసీసీ సభ్యులు, కార్యవర్గ సభ్యుల ఎన్నిక బాధ్యతను పార్టీ తాత్కా లిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ పీసీసీ బుధవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం

కీలక దశకు కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు 

పీసీసీ సభ్యులుగా 45 మందికి ఛాన్స్‌

కొందరికి కీలక పదవులు దక్కే అవకాశం 

ఏఐసీసీలోనూ జిల్లా ప్రాతినిధ్యం ఉంటుందనే సంకేతాలు

ముఖ్యమైన స్థానాలపై అక్టోబరులో స్పష్టత 

డీసీసీల పగ్గాలూ కొత్త వారికేనని నిర్ణయం


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరింది. పీసీసీ సభ్యుల ఎన్నిక పూర్తవ గా, పీసీసీ కార్యవర్గ పదవులు, రాష్ట్రం నుంచి ఏఐసీసీ సభ్యులు, కార్యవర్గ సభ్యుల ఎన్నిక బాధ్యతను పార్టీ తాత్కా లిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ పీసీసీ బుధవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దాంతో ఆమె ఆమోదంతో త్వరలో ఆ జాబితాలు విడుదల వుతాయని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అక్టోబరు 19తో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక వ్యవహారం యుగియ నుండటంతో, ఆ తర్వాత పీసీసీ కార్యవర్గం, ఏఐసీసీ సభ్యు లు, కార్యవర్గం, వాటితో పాటే డీసీసీలకు కొత్త అధ్యక్షులు, కొత్త కార్యవ ర్గాలను ప్రకటిస్తారని క్యాడర్‌ చర్చించు కుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎను ముల రేవంత్‌రెడ్డి ఇప్పటికే జిల్లా నుంచి ప్రాతి నిధ్యం వహిస్తుండగా, ఆయనతో పాటు సీనియర్‌ ఉపాధ్య క్షుడిగా మాజీ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి కొనసాగుతు న్నారు. తాజాగా ఏర్పడబోయే పీసీసీలోనూ, ఏఐసీసీ కార్యవర్గంలోనూ ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం ఉంటుం దని, ఆ మేరకు ప్రతిపా దనలు అధిష్ఠానానికి చేరా యని చెబుతున్నారు. 


అక్టోబరులో స్పష్టత

ఏఐసీసీ అధ్యక్ష పదవికి సైతం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలనే సంకల్పంతో కాంగ్రెస్‌ షెడ్యూల్‌ ప్రకటించిన విషయం విదితమే. అవసరమైతే ఎన్నిక అక్టోబర్‌ 17న నిర్వహించి, ఫలితాన్ని 19న ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో పీసీసీ ప్రతినిధుల సమావేశం జరిగింది.  పీసీసీ ప్రతినిధులుగా ఈ సమావేశానికి హాజరైన వారే ఏఐసీసీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలో ఓటేయడంతో పాటు, పీసీసీ సభ్యులుగానూ కొనసాగుతారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 45 మంది వరకు పీసీసీ ప్రతినిధులుగా నియమితులయ్యారు. వీరంతా ఐదేళ్ల కాలపరిమితితో 2027 వరకు పీసీసీ సభ్యులుగా కొనసాగుతారు. వీరితో పాటు మరో 20 శాతం మందిని కోఆప్షన్‌ సభ్యులుగా నియమిస్తారు. ఏఐసీసీ అధ్యక్ష పదవిని ఒకవైపు రాహుల్‌గాంధీ చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి తీర్మానాలు, ఒత్తిళ్లు వస్తుండగా, మరోవైపు ప్రజాస్వామ్యయుత ఎన్నిక కోసం సీనియర్లు సిద్ధమవుతున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం పూర్తి స్థాయిలో రాహుల్‌ గాంధీకి మద్దతు ప్రకటించడంతో పాటు, పీసీసీ కార్యవర్గం, ఏఐసీసీ కార్యవర్గంలో రాష్ట్రానికి పదవులిచ్చే అంశాలను సోనియాగాంధీకే అప్పగిస్తూ తీర్మానం చేశారు. దాంతో అధ్యక్ష ఎన్నిక కొలిక్కి వచ్చే వరకు కార్యవర్గాల నియామకాలపై వేచి ఉండాల్సి ఉంటుందని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.


పెరగనున్న ప్రాతినిధ్యం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లాకే చెందిన వారు దాంతో పాటు పార్టీకి మొదటి నుంచి ఈ జిల్లా అండగా ఉందన్న అభిప్రా యంలో ఉన్న అధిష్టానం చావోరేవోగా సాగనున్న రాబోయే ఎన్నికల సమరానికి తయారు చేసే బృందంలో పాలమూరు నాయకులకు మరింత ప్రాధాన్యమిస్తుందని తెలుస్తోంది. ఆ మేరకు  తమకు సంకేతాలు వచ్చాయని కీలక నాయకులు చెబుతున్నారు. గత ఏఐసీసీ కార్యవర్గంలో మాజీ మంత్రి డాక్టర్‌ చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఎస్‌ఏ సంపత్‌కుమార్‌, డాక్టర్‌ చల్లా వంశీచంద్‌రెడ్డి ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్నారు. సంపత్‌ కుమార్‌కు పీసీసీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌గా ఈదఫా అవకాశ మొస్తుందనే సంకేతాలు వస్తుండడంతో వంశీచంద్‌ రెడ్డి, చిన్నారెడ్డితో పాటు మరో మాజీ మంత్రి, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఏఐసీసీలో ఛాన్స్‌ దక్కుతుందని చెబుతున్నారు. వీరితో పాటు జిల్లాలోని ఇద్దరు సీనియర్లకు పీసీసీలో ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులను కట్టబెట్టి ఆయా విభాగాల బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. పీసీసీ సభ్యులుగా నియమితులైన వారిలో దాదాపు 15 మందికి పీసీసీ కార్యదర్శులుగా, మరో 15 మందికి సంయుక్త కార్యద ర్శులుగా అవకాశాలు దక్కు తాయని చెబుతున్నారు. జిల్లాల్లో పార్టీ సమన్వ యానికి కీలకమవుతోన్న డీసీసీ అధ్యక్ష పదవుల నియామకాలనూ వీటితో పాటే ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇటీవలే నారాయణపేట జిల్లాకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియ మితులైన వాకిటి శ్రీహరికి పూర్తిస్థాయి డీసీసీ అధ్యక్షు డిగా బాధ్యత లిస్తారని, మహబూబ్‌నగ ర్‌కు కూడా ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఒకరికి ఖరారయ్యిందని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రెండు డీసీసీలకు అధ్యక్షుల మార్పు ఉంటుందని, డీసీసీ అధ్యక్షులతో పాటు డీసీసీ కార్యవర్గాలను కూడా ఇదే సమయంలో వెల్లడి స్తారని తెలుస్తోంది. మొ త్తంగా రాహుల్‌ గాంధీ జోడో యాత్ర ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించే సమ యానికి కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయని క్యాడర్‌ ఆశిస్తోంది.

Read more