ఏకాగ్రతతో సాధన చేయాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2022-11-27T23:09:32+05:30 IST

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఏకాగ్రతతో సాధన చేస్తేనే ప్రభుత్వ కొలువులు సాధించవచ్చని ఎస్పీ అపూర్వారావు అన్నారు.

ఏకాగ్రతతో సాధన చేయాలి : ఎస్పీ

వనపర్తి క్రైం, నవంబరు 27: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఏకాగ్రతతో సాధన చేస్తేనే ప్రభుత్వ కొలువులు సాధించవచ్చని ఎస్పీ అపూర్వారావు అన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్న 400 మంది అభ్యర్థులకు ఆదివారం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఎస్పీ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిని సైనా నెహ్వాల్‌ రన్నింగ్‌ కోచ్‌ గోనె రవీందర్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ప్రోత్సహించే దిశగా ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామన్నారు. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయాలని సూ చించారు. ప్రాక్టీస్‌ చేసే క్రమంలో ఎలాంటి గాయాలకు లోను కావద్దని, ఫలితాలు ఏ విధంగా ఉన్నా ప్రయత్నం మాత్రం మరువవద్దని అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి, ఎస్‌ఐ కానిస్టేబుల్‌ శిక్షకులు రాజగౌడ్‌, గౌస్‌ పాషా, ప్రముఖ వైద్యుదు డాక్టర్‌ రమేష్‌ బాబు, సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్‌ గౌడ్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు సురేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:11:34+05:30 IST