ప్రజానాయకుడు జగ్జీవన్‌రామ్‌

ABN , First Publish Date - 2022-04-05T05:30:00+05:30 IST

అట్టడుగు వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి భారత ఉప ప్రధానిగా సేవలందించిన బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆదర్శవంతమైన ప్రజా నాయకుడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కొనియాడారు.

ప్రజానాయకుడు జగ్జీవన్‌రామ్‌
గద్వాలలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం

గద్వాల టౌన్‌/ అలంపూర్‌చౌరస్తా, ఏప్రిల్‌ 5 : అట్టడుగు వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి భారత ఉప ప్రధానిగా సేవలందించిన బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఆదర్శవంతమైన ప్రజా నాయకుడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కొనియాడారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కార్మికలోకానికి ఎనలేని సేవలం దించిన జగ్జీవన్‌రామ్‌ వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలో హరిత విప్లవానికి బాటలు వేశారన్నారు. జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైస్‌చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు, గద్వాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, గట్టు ఎంపీపీ విజయ్‌, ధరూరు వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గోవిందు పాల్గొన్నారు.

- అలంపూర్‌ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వ హించారు. జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం, నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ దళితుల ఆశాజ్యోతి అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. పేద దళితుల కోసం ఏన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహా నాయకుడు అని కొనియాడారు. అలాంటి  మహానీయుడి చరిత్రను ప్రతీ ఒక్క దళితుడు తెలుసుకోవాలని , ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, నాయకులు వెంకటేష్‌, శేఖర్‌, రాముడు, బాలు, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-04-05T05:30:00+05:30 IST