బైరి నరేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-12-30T23:47:33+05:30 IST

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ రాజోలికి చెందిన అయ్యప్ప స్వాములు, భక్తులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బైరి నరేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు
రాజోలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న అయ్యప్ప స్వాములు

రాజోలి, డిసెంబరు 30 : అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ రాజోలికి చెందిన అయ్యప్ప స్వాములు, భక్తులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన అతడిని కఠినంగా శిక్షించాలని కోరారు. అంతకుముందు స్వాములు, భక్తులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయ్యప్ప స్వాములు శ్రీనివాసులు, నర్వింహులు, అశోక్‌, అంజి, జై శ్రీరామ్‌ సేవా సమితి సభ్యులు శశికుమార్‌, గోవర్ధన్‌రెడ్డి, ఈరన్న, అడివిస్వామి తదితరులు పాల్గొన్నారు.

బైరి నరేశ్‌ను అరెస్ట్‌ చేయాలి

గద్వాల క్రైం : కొడంగల్‌ సభలో అయ్యప్ప స్వామి జననం, విష్ణువు, ఈశ్వరుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని అయ్యప్ప స్వాములు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2022-12-30T23:47:33+05:30 IST

Read more