భౌతిక దాడులు పిరికిపంద చర్య

ABN , First Publish Date - 2022-03-04T06:11:43+05:30 IST

తమపార్టీ నాయకుల ఇళ్లపై బుధవారం రాత్రి, మరుసటి రోజు ఉదయం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులు చేయడం పిరికిపంద చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అన్నారు.

భౌతిక దాడులు పిరికిపంద చర్య
మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి

- ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధం

- విలేకరుల సమావేశంలో హెచ్చరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి


మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), మార్చి 3 : తమపార్టీ నాయకుల ఇళ్లపై బుధవారం రాత్రి, మరుసటి రోజు ఉదయం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులు చేయడం పిరికిపంద చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అన్నారు. ఈ విషయంపై గురువారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్‌ సభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో నామినేషన్‌ వేసేటప్పుడు మంత్రి సమర్పించిన అఫిడవిట్లలో ఉన్నటువంటి తప్పుడు సమాచారంపై రాఘవేందర్‌ రాజు, బాండేకర్‌ విశ్వనాథ్‌ తదితరులు న్యాయం పోరాటం చేస్తుండగా, వాళ్ల మీద కక్షసాధింపులకు పాల్పడుతూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వా మ్యంలో ఏదైనా తప్పిదం జరిగితే ప్రజలకు నిలదీసే అధికారం ఉంటుందని గుర్తు చేశారు. మీరు చేసే తప్పులను నిలదీయోద్దా అని ఆయన ప్రశ్నించారు. అసలు ఫారుక్‌, గయాసోద్ధీన్‌లు ఎవరో వీరికి తెలియదని, కక్షసాధింపులకే ఈ ఎపిసోడ్‌ను క్రియేట్‌ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు వారు రాళ్లు విసిరేటప్పుడు కూడా పట్టుకోలేదని, వారిని ఇంకా ఎంకరేజ్‌ చేశారని ఆరోపించారు. పోలీసులు కూడా మంత్రికి దాసోహంగా మారారని విమర్శిం చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు మాట్లాడుతూ రాత్రి ఈ ఇళ్లపై పెట్రోల్‌ బాంబులు విసిరారని అన్నారు. సీసీ ఫుటేజీలు ఇస్తామని, వారిని వెంటనే అరెస్ట్‌ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ర్యాలీకి అనుమతి ఎలా ఇస్తారు, తాము శాంతియుతంగా ధర్నా చేసి ఎస్పీకి వినతిపత్రం ఇస్తామంటే ముందస్తుగా ఎందుకు అరెస్టు  చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక న్యాయం మాకో న్యాయమా దీనికి పోలీసులే జవాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశాడు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, క్రిష్ణవర్దన్‌ రెడ్డి, అంజయ్య, రామాంజనేయులు, కిరణ్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Read more