అభివృద్ధి వైపే ప్రజలు

ABN , First Publish Date - 2022-10-05T05:01:39+05:30 IST

తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పఽథ కాలు నచ్చి అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధి వైపే ప్రజలు
టీఆర్‌ఎస్‌లో చేరిన వారినుద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

మూసాపేట, అక్టోబరు 4 : తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పఽథ కాలు నచ్చి అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తిమ్మాపూర్‌, వేముల గ్రామాల్లో ఏర్పా టు చేసిన ఆసరా పింఛన్‌ పత్రాల అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి వైపు ప్రజలు నిలబడటం అభినం దనీయమన్నారు. మండలం లోని వేముల గ్రామంలో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బుర్రన్నతోపాటు ఆ పార్టీకి చెందిన మంగలి వెంకటేశ్‌, వెంకటేశ్వర్లు, సుండుభీం, ఎర్ర వెంకట్రాములు, ఎర్ర నాగరాజు, దొబ్బిలి నాగరాజు, ఖదీర్‌, ఉస్మాన్‌, కతాల్‌, మన్నె తదితరులు మంగళవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పాలనలో ఎంతో అభివృద్ధి జరుగు తోందన్నారు. కర్వెన ప్రాజెక్ట్‌ పనులు చాలావరకు పూర్త య్యాయని, ప్రాజెక్ట్‌ పూర్తైతే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందన్నారు. వ్యవసాయానికి మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. 57 ఏళ్లు నిండినవారిని ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే చాలావరకు ఇచ్చామని, అర్హులకు రానున్న రోజుల్లో విడతల వారీగా ఇస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి కష్ఠమొచ్చినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మోసపూరిత మాటలు నమ్మవద్దని పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వ డంలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో ఉచిత పథకాలు బందు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెలికలు పెడుతోందని, గ్రామాల్లోకి బీజేపోల్లు వస్తే ప్రజలు నిలదీయాలని ఎమ్మెల్యే సూచించారు. మతాలు, కులాల పేర్లతో కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధిపొందేందుకు చూస్తున్నాయని, ప్రజలు కేసీఆర్‌ వెంటే ఉండాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఇంద్రయ్యసాగర్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు బండ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు అరుణారఘుపతిరెడ్డి, చంద్రశేఖర్‌, స్వరూపారాణి, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ, సుకన్య, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-05T05:01:39+05:30 IST