సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి

ABN , First Publish Date - 2022-11-27T22:42:07+05:30 IST

విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు.

సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి
విజేతలతో జేవీవీ నాయకులు తదితరులు

నారాయణపేట టౌన్‌, నవంబరు 27 : విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ జేవీవీ అధ్యక్షుడు నరసింహరావు అధ్యక్షతన నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై మక్కువ పెంచుకొని ముందుకు సాగితే భావితరాలు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారన్నారు. ప్రతీ విషయాన్ని పరిశీలన ధోరణితో ఆలోచించి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కోరారు. జేబీవీ రాష్ట్ర కోశాధికారి జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ చెకుముకి మాస పత్రిక చదివితే ప్రయోగాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి తెలుగు భాషలో కేజీబీవీ నారాయణపేట, ఆంగ్ల భాషలో జడ్పీహెచ్‌ఎస్‌ దామరగిద్ద, ప్రైవేటు పాఠశాలల నుంచి తెలుగులో హంసవాహిని నారాయణపేట, ఆంగ్ల భాషలో కృష్ణవేణి స్కూల్‌ మక్తల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా విజేతలకు ప్రశంసా పత్రాలు, షీల్డ్‌ అందించారు. వచ్చే నెల 9వ తేదీ నుంచి సిరిసిల్లలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో వీరు పాల్గొంటారని తెలిపారు. జిల్లా పరీక్షల విభాగం రాజేందర్‌, జేవీవీ నాయకులు మధు, బాలకిష్టప్ప, భానుప్రకాష్‌, బాలాజీ, మహిపాల్‌, భాషోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌, లక్ష్మికాంత్‌, ఇబ్రహీం, స్వప్న పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T22:42:08+05:30 IST