రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-11-15T23:14:32+05:30 IST

తమ్ముడిని చూసేందుకు వచ్చిన అన్న తిరిగి రాని లోకాలకు వె ళ్లాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కొత్తకోట, నవంబరు 15: తమ్ముడిని చూసేందుకు వచ్చిన అన్న తిరిగి రాని లోకాలకు వె ళ్లాడు. ఈ ఘటన ఘటన మంగళవారం కొత్తకోట జాతీయ రహదారిపై చోటు చేసుకుం ది. ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండ లం అంకినపల్లి గ్రామానికి చెందిన హనుమంతు(50) కొత్తకోటలో నివాసం ఉంటున్న తమ్ముడు వెంకటయ్యను చూడటానికి వచ్చాడు. స్వగ్రామానికి మధ్యాహ్నం తిరిగి ఆటోలో వెళ్తుండగా జాతీయ రహదారిపై కర్నూలు వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటన లో హనుమంతు అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే హనుమంతు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2022-11-15T23:14:32+05:30 IST

Read more