మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేస్తాం

ABN , First Publish Date - 2022-12-09T23:14:58+05:30 IST

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తుందని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్‌ అబ్రహాం అన్నారు.

మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
వాల్మీకి సోదరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేస్తున్న ఎమ్మెల్యేలు

- ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం

- గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం

- వాల్మీకీ బోయల దీక్ష విరమింప చేసిన ఎమ్మెల్యేలు

- ప్రతిపక్షాలతో జాగ్రత్తగా ఉండాలని సూచన

గద్వాల, డిసెంబరు 9: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తుందని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్‌ అబ్రహాం అన్నారు. గద్వాల కలెక్టరేట్‌ సమీపం లో నెల రోజులుగా దీక్ష చేస్తున్న వాల్మీకులకు శుక్రవా రం వారు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ 60 ఏళ్లుగా పాలించిన వివిధ పార్టీలు వాల్మీకి బోయలను ఓట్లు వేసే యంత్రాలుగా చూశారని విమర్శించారు. ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి మోసం చేశారని తెలిపారు. అధికారం లో ఉన్నప్పుడు ఏమీ చేయలేని ప్రతిపక్షాలు, ఇప్పుడు రెచ్చగొట్టేలా మాట్లాడటంపై ఆగ్రహం వ్వక్తం చేశారు. తెలంగాణలో వాల్మీకి బోయల కష్ట సుఖాలు తెలిసిన నాయకుడిగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వారిని ఎస్టీ జాబితాలో చేర్చడా నికి కృషి చేశారన్నారు. అందులో బాగంగానే చెల్లప్ప కమిషన్‌ ఏర్పాటు చేసి బోయల స్థితిగతులపై నివేది కలు తెప్పించుకున్నారని చెప్పారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు గత అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. కానీ సాంకేతిక కారణాలతో అది వెనక్కి వచ్చిందని వెల్లడిం చారు. మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. మహబూబ్‌ నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. వాల్మీకి సోద రులు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని చె ప్పారు. కానీ ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కో సం ఆలోచిస్తున్నాయని, వారికి చిత్తశుద్ధి లేదని విమ ర్శించారు. వాల్మీకి సోదరులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్తుందని, దీక్ష విరమించాలని కోర గా, అందుకు వారు అంగీకరించారు. ఎమ్మెల్యేలు వారికి నిమ్మరసం అందించి వారిచే దీక్షలను విరమింపచేశా రు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ, పట్టణ అధ్యక్షుడు గోవిందు, వాల్మీకి సం ఘం నాయకులు వైండింగ్‌ రాములు, కోటేష్‌, మురళి, రమేష్‌నాయుడు, హనుమంతునాయుడు, వీరన్న, వెం కటన్న, సవారన్న, రఘునాయుడు, వేణునాయుడు, శే షాద్రి, ధర్మనాయుడు, వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:14:59+05:30 IST