‘పల్లె ప్రగతి’తో గ్రామాల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-06-08T05:11:50+05:30 IST

ప్రభుత్వం కోట్లాది రూపాయలతో చేపడుతున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాలు అభివృద్ధి చెందు తున్నాయని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

‘పల్లె ప్రగతి’తో గ్రామాల అభివృద్ధి
జక్కిరెడ్డిపల్లిలో మొక్క నాటుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జక్కిరెడ్డిపల్లిలో పనుల పరిశీలన

వడ్డేపల్లి, జూన్‌ 7 : ప్రభుత్వం కోట్లాది రూపాయలతో చేపడుతున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాలు అభివృద్ధి చెందు తున్నాయని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని  జక్కిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహిం చిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మొక్క లు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్క రూ మరుగుదొడ్లు వాడాలని సూచించారు. హరిత హారంలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసు కున్నారు. తమకు జూలకల్‌లో కాకుండా గ్రామంలోనే రేషన్‌ సరుకులు ఇవ్వాలని జక్కిరెడ్డిపల్లి గ్రామస్థులు కోరారు. గ్రామంలో మురుగుకాలువ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలన్నారు.  కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకట్‌ రెడ్డి, ఎంపీడీవో రవీంద్ర, ఎంపీవో తిరుపతి, వినోద్‌, మద్దిలేటి, రవీందర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ వెంకటేష్‌, మహానంది, వడ్డేపల్లి శ్రీనివాసులు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు పాల్గొన్నారు. 


ప్రజలు భాగస్వాములు కావాలి :  జడ్పీ సీఈవో విజయా నాయక్‌ 

కేటీదొడ్డి : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతి నిధులు, అధికారులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్‌ సీఈవో విజయానాయక్‌ అన్నారు. మండలంలోని కొండాపురం గ్రామంలో కొన సాగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. క్రీడా మైదానం పనులను పరిశీలించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచు జయమ్మ మాట్లా డుతూ గ్రామంలో ముళ్లచెట్ల తొలగింపు, హెల్త్‌సెంటర్‌, వాటర్‌ట్యాంక్‌, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను చేపట్టి నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో పాండు, మండల అధ్యక్షుడు మహానందిరెడ్డి, పంచాయతీ కార్య దర్శి మునినాయక్‌, ప్రత్యేకాధికారి సురేష్‌ పాల్గొన్నారు.  


గ్రామాల అభివృద్ధే లక్ష్యం 

గట్టు :  గ్రామాల అభివృద్ధే ‘పల్లె ప్రగతి’ లక్ష్యమని జడ్పీటీసీ సభ్యురాలు శ్యామల అన్నారు. మండల పరిధి లోని బల్గెర గ్రామంలో కొనసాగుతున్న ‘పల్లె ప్రగతి’ పనులను మంగళవారం సర్పంచ్‌ హనుమంతునాయుడు తో కలసి పరిశీలించారు. గ్రామంలోని వీదులలో పర్య టించి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లపై మురికి నీరు పారకుండా పరి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి అవరణలో మొక్క లు నాటుకోవాలని చెప్పారు. పాడుబడ్డ ఇళ్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు రూపవతి, కిష్టప్ప, ఉప సర్పంచ్‌ హనుమంతు, మాజీ సర్పంచ్‌ సామేలు, పొగాకు ఈరన్న, బీమన్న తదితరులు పాల్గొన్నారు.


పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

రాజోలి : పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాజోలి ఉపసర్పంచ్‌ గోపాల్‌ అన్నారు. గ్రామంలో మంగళవారం నిర్వహించి ‘పల్లె ప్రగతి’ పనుల్లో మహిళా సంఘాల సభ్యులు పాల్గొని రహదారులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోవింద్‌రావు, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, టీఏ ప్రభాకర్‌, మద్దిలేటి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు

గద్వాల : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొత్తపల్లి, లత్తిపురం, సంగాల గ్రామాల్లో మంగళవారం రహదారులను శుభ్రం చేశారు. కొత్తపల్లి సర్పంచు అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. పనిచేయని బావులను పూడ్చి వేశారు. కొండపల్లిలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పనులు నిర్వహిం చారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, డీఆర్‌డీవో ఉమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి శ్యామ్‌సుందర్‌, ఎంపీడీవో చెన్నయ్యలు వీరాపురం సమీపంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. 


పనులను వేగవంతం చేయాలి

మానవపాడు : ‘పల్లె ప్రగతి’లో నిర్దేశించిన పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవో రమణారావ్‌, ప్రత్యేకా ధికారి నాగేంద్రం సూచించారు. మండలంలోని గోకుల పాడులో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హరితహారం పనులను పరిశీలిం చారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీయ డం, వాటి రక్షణ చర్యలపై సిబ్బందితో చర్చించారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేయించారు. డ్రైనేజీలను శుభ్రం చేసి గ్రామంలో స్వచ్ఛ వాతావరణం నెలకొల్పాల న్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read more