నో సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-12-02T00:12:45+05:30 IST

పదర మండలంలోని ఓ గ్రామం లో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ లేదు. ఆ గ్రామంలో వ్యక్తి చనిపోతే కూతురు చూడటానికి వెళ్లింది. ఇదే సమయంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్‌కు ఫోన్‌ చేద్దామన్నా నెట్‌వర్క్‌ లేదు. దీంతో ఆమెను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది..

నో సిగ్నల్‌

- సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ లేని గ్రామాలెన్నో

- పదర మండలంలోనే అనేక గ్రామాలు

- సాంకేతిక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

అచ్చంపేట రూరల్‌, డిసెంబరు 1 : పదర మండలంలోని ఓ గ్రామం లో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ లేదు. ఆ గ్రామంలో వ్యక్తి చనిపోతే కూతురు చూడటానికి వెళ్లింది. ఇదే సమయంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్‌కు ఫోన్‌ చేద్దామన్నా నెట్‌వర్క్‌ లేదు. దీంతో ఆమెను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది..

ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘సెల్‌’ వ్యవస్థనే రాజ్యమేలుతోంది. ప్రపం చంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. మారు గ్రామాలకు సైతం సాంకేతికత చేరువైదంటే అది కేవలం మొబైల్‌ రంగంతోనే సాధ్యమైంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం డిజిటల్‌ రంగం.. ప్రధానంగా సాంకేతిక వనరులను అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంకుకు సంబంధిం చిన లావాదేవీలు జరపాలంటే కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.. ఇప్పుడు మొబైల్‌తోనే అన్ని పనులను చక్కబెట్టేస్తున్నారు. అంతటి ప్రాధాన్యత కలిగిన మొబైల్‌ సేవలు నల్లమల ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు అందడం లేదు. అక్కడి ప్రజలకు సాంకేతిక అనే పదం ఎండమావిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో ని ఎజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తుంది.

నెట్‌వర్క్‌లేని గ్రామాలు..

అచ్చంపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామా లకు ఇప్పటికి మొబైల్‌ సిగ్నల్స్‌ అందడం లేదు. వాటిలో పదర మండలంలోని చెన్నంపల్లి, మారడు గు, ఇప్పలపల్లి, గానుగుపెంట, మద్దిమడుగుతో పాటు నల్లమల లోతట్టు అభయారణ్యంలోని మల్లా పూర్‌పెంట, అప్పాపూర్‌, రాంపూర్‌పెంట, సంగిడి గుండాల, మేడిమొల్కల, ఈర్లపెంటతో సహా మరికొన్ని గ్రామాలు ఉన్నాయి. వీటిలో పదర మండలం పరిధిలోని గ్రామాలకు నిత్యం ప్రజా రవాణ ఉంటుంది.

నిత్యం యాత్రికుల రద్దీ

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో మద్దిమడుగు క్షేత్రం ఒకటి. ఈ ఆలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మన్ననూర్‌ నుంచి మద్దిమడుగు వరకు నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతుం ది. అలాగే మద్దిమడుగు గ్రామం కృష్ణానదిని ఆనుకొని ఉంటుంది. నది దాటితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సరిహద్దు వస్తుంది. ఒకరకంగా మద్దిమడుగు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. అలాంటి ఈ గ్రామంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ లేకపోవడంతో అక్కడ ఏం జరిగినా బయటి ప్రపంచానికి అంత త్వరగా తెలియదు. పదర మం డలంలోని మొబైల్‌నెట్‌వర్క్‌ లేని గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు పింఛన్‌ పొందాలన్నా సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఉన్న గ్రామాలకు వెళ్లాల్సిందే. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వా హకులు నెట్‌వర్క్‌ ఉన్న గ్రామాలకు వెళ్లి పౌష్టికాహారాన్ని తీసుకుంటు న్నారు. ఇక విద్యార్థులకు రోజు జరిగే ఆన్‌లైన్‌ క్లాస్‌ల సమయంలో చెట్లు ఎక్కడం, నెట్‌వర్క్‌ ఉన్న చోటా గుమిగూడటం నిత్యకృత్యంగా మారింది.

తన మండలంలోని మొబైల్‌ నెట్‌వర్క్‌ లేని గ్రామాల్లో సెల్‌ట వర్ల ఏర్పాటుకు అనుమతిం చేలా చూడాలని గతంలో జరిగిన జడ్పీ సమావేశంలో పదర జడ్పీటీసీ సభ్యుడు మూడావత్‌ రాంబాబునాయక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్‌, ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. అటవీ అధికారుల నిర్లక్ష్యంతోనే గ్రామాల్లో మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేసేందుకు ఇబ్బంది ఏర్పడు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్‌వర్క్‌ కంపెనీలు సెల్‌ టవర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. నిబంధనల పేరుతో అటవీ అధికారులు అడ్డుంటున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-12-02T00:12:47+05:30 IST