రైతులెవరూ బ్యాంకు రుణాలు కట్టొద్దు

ABN , First Publish Date - 2022-06-08T05:07:36+05:30 IST

రైతులెవరూ బ్యాంకుల నుంచి తీసుకున్న పం ట రుణాలు కట్టవద్దని కాంగ్రెస్‌పార్టీ వికారాబాద్‌ జిల్లా అఽధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

రైతులెవరూ బ్యాంకు రుణాలు కట్టొద్దు
గువ్వోని కుంట తండా రచ్చబండలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి

- కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రుణమాఫీ చేస్తాం

- రచ్చబండలో వికారాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి 

మహమ్మదాబాద్‌, జూన్‌ 7 :  రైతులెవరూ బ్యాంకుల నుంచి తీసుకున్న పం ట రుణాలు కట్టవద్దని కాంగ్రెస్‌పార్టీ వికారాబాద్‌ జిల్లా అఽధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అఽధికా రంలో వచ్చాక ఆ రుణాలన్నింటినీ మాఫీ చేస్తుందని తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని గువ్వనికుంటతండా, పెద్దతండా, మంగంపేట గ్రామాలలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి రామ్మోహన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీన్ని అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయం అన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తా మని అన్నారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షు డు కేఎం నారాయణ, ఉపాధ్యక్షుడు బాలముకుందం, వెన్నచేడ్‌ సర్పంచ్‌ పులిందర్‌, పార్టీ మండల నాయకులు రాఘవేందర్‌రెడ్డి, యం.లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ పాల్గుణ, నర్సింహారెడ్డి, దశరథ్‌ పాల్గొన్నారు.

Read more