జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-14T04:28:56+05:30 IST

ఈనెల 16 నుంచి 18వరకు నిర్వహించే తెలంగాణ జాతీ య సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు.

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిచందన

- ప్రణాళికలు సిద్ధం చేయాలి 

- కలెక్టర్‌ హరిచందన 

నారాయణపేట టౌన్‌, సెప్టెంబరు 13 : ఈనెల 16 నుంచి 18వరకు నిర్వహించే తెలంగాణ జాతీ య సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్‌లో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలె క్టర్లు, జిల్లా అధికారులతో వజ్రోత్సవాల నిర్వాహణ పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. 16న నారాయణపేట క్రీడా మైదానంలో ర్యాలీ ప్రా రంభమై శెట్టి ఫంక్షన్‌ హాల్‌ వరకు కొనసాగి అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తామనానరు. ర్యాలీ సజావు గా జరిగేలా చూడడంతో పాటు భోజనాలు, తాగు నీరు ఏర్పాట్లు చేయాలని, ర్యాలీలో పాల్గొనే వారికి జాతీయ పతాకాలను ఇవ్వాలన్నారు. మక్తల్‌ జూని యర్‌ కళాశాల నుంచి ద్వారక ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ కొనసాగుతుందని స్వయం సహాయక సం ఘాలు, మహిళ సంఘాల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొనేలా చూడాలన్నారు. 17న పరేడ్‌ మైదానంలో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని అదేరోజు గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, మ హిళా సంఘాల ప్రతినిధులను ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌లో సీఎం పా ల్గొనే కార్యక్రమానికి పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. 18న అంజనా గార్డెన్‌లో సాంస్కృతి క కార్యక్రమాలు, 15న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలపై త్రివర్ణ రంగు విద్యుత్‌ లైట్లు పెట్టించాల న్నారు. ఈ వజ్రోత ్సవాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజ లు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజా రాణి, ఆర్డీవో రాంచందర్‌ నాయక్‌, డీఎస్పీ సత్యనారాయణ, కమిషన్లు  పాల్గొన్నారు.

Updated Date - 2022-09-14T04:28:56+05:30 IST