-
-
Home » Telangana » Mahbubnagar » Nagari MLA Roja in the presence of Jogulamba-MRGS-Telangana
-
జోగుళాంబ సన్నిధిలో నగరి ఎమ్మెల్యే రోజా
ABN , First Publish Date - 2022-02-20T05:17:36+05:30 IST
అలంపూర్ ఆల యాలను శనివారం న గిరి ఎమ్మెల్యే సినీ నటి రోజా దర్శించుకొని ప్ర త్యేక పూజలు నిర్వ హించారు.

ఉండవెల్లి, ఫిబ్రవరి 19: అలంపూర్ ఆలయాలను శనివారం నగిరి ఎమ్మెల్యే సినీ నటి రోజా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఉదయం ఆలయానికి వచ్చిన ఆమెను ఆలయ ఈవో పురేం దర్‌కుమార్, ప్ర ధాన అర్చకులు ఆనం దర్ శర్మ స్వాగతం పలికారు. మొదట బాల బ్రహ్మేశ్వర్ స్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుం కుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అం దించి సత్కరించి, ఆలయ విశిష్టితను వివరించారు. కాగా సినీ నటిరోజా అలంపూ ర్ ఆలయానికి రావడంతో అభిమానులు పెద్దఎత్తున తరలి వచ్చారు.