డిజిటల్‌ ఫైనాన్స్‌తో బహుళ ప్రయోజనాలు

ABN , First Publish Date - 2022-03-16T05:45:34+05:30 IST

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థిక లావాదేవీల్లోనూ సాంకేతికత అవసరం పెరిగిందని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు.

డిజిటల్‌ ఫైనాన్స్‌తో బహుళ ప్రయోజనాలు
బ్రోచర్‌ను విడుదల చేస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, అధికారులు

- అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష 

- విద్యార్థులకు అవగాహన సదస్సు

గద్వాల టౌన్‌, మార్చి 15 : మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థిక లావాదేవీల్లోనూ సాంకేతికత అవసరం పెరిగిందని  అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. ఈ క్రమంలో డిజిటల్‌ ఫైనాన్స్‌కు సంబంధిం చి ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవడం అనివార్య మని చెప్పారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్‌ ఫైనాన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ నగదుకు బదులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని డిజి టిల్‌ లావాదేవీలు నిర్వహించుకోవడం శ్రేయస్కర మన్నారు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా, మొబైల్‌ ఆధారంగా వివిధ యాప్‌ల ద్వారా నిర్వహించే లావాదేవీలతో భద్రత కూడా ఉంటుందన్నారు. విద్యా ర్థులు అవగాహన పెంచుకోవడమే కాకుండా ఇతరుల కు సైతం వివరించాలని సూచించారు. కళాశాల వాణి జ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వినియోగదారుల క్లబ్‌ కన్వీనర్‌ శివారెడ్డి మాట్లాడుతూ 1986లో ఏర్పడిన వినియోగదారుల హక్కుల చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ డీ శ్రీపతినాయుడు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రేవతి, కామర్స్‌ హెచ్‌ఓడీ నరసింహులు, ఆసరా జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ రంగ్‌భారత్‌, కృష్ణ, ఇక్బాల్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.


పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశానికి లక్కీడిప్‌ 

గద్వాల క్రైం : హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఒకటవ తరగతిలో ప్రవేశానికి లక్కీడిప్‌ ద్వారా విద్యా ర్థిని ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశపు హాలులో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో మంగళవారం లక్కీడిప్‌ నిర్వహించినట్లు చెప్పారు. 2022-23 విద్యాసంవత్సరానికి హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఒకటవ తరగతిలో ఒక్క సీటు ఉండగా, నాలుగు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిని పరిశీలించి లక్కీడిప్‌ తీసినట్లు చెప్పారు. మొదటిసారి డిప్పు తీయగా కేటీదొడ్డి మండలానికి చెందిన ఎస్‌.జెస్సిక ఎంపికైనట్లు తెలిపారు. ఆమె అవకాశాన్ని వినియోగించుకోకపోతే వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న అదే మండలానికి చెందిన జె.వర్షిత్‌రెడ్డికి అవకాశం ఉంటుం దని చెప్పారు. అతడు కూడా వినియోగించుకోలేకపోతే మూడవ స్ధానంలో ఉన్న అలంపూర్‌కు చెందిన అన్వేష్‌ వినియోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి శ్వేత, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more