పంట మార్పిడితోనే అధిక దిగుబడి

ABN , First Publish Date - 2022-10-01T04:56:36+05:30 IST

పంట మార్పిడి తోనే అధిక దిగుబడి సాధించవచ్చునని, రైతులు పంట మార్పిడిపై అవగాహన కలిగి ఉండాలని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

పంట మార్పిడితోనే అధిక దిగుబడి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

వనపర్తి రూరల్‌,సెప్టెంబరు 30: పంట మార్పిడి తోనే అధిక దిగుబడి సాధించవచ్చునని, రైతులు పంట మార్పిడిపై అవగాహన కలిగి ఉండాలని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాజ నగరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహాజన సభ కు ఆయన  ముఖ్య అతిథిగా  హాజరై మాట్లాడారు.  మార్కెట్లో ఏ పంటకు ఎక్కువ డిమాండ్‌ ఉందో చూసుకొని రైతులు ఆ పంటలు వేసుకోవాలన్నారు.  రాజనగరం ప్రాథమిక సహకార సంఘం గతంలో కన్నా ఇప్పుడు చాలా మంచి  కార్యక్రమాలు చేపడు తోందని ప్రశంసించారు. సహకార సంఘం ఆధ్వర్యం లో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామ న్నారు. కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, అచ్యుతాపూర్‌ సర్పంచ్‌ శారద ఆశన్న నాయుడు, వైస్‌ చైర్మన్‌ రఘువర్ధన్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ ప్రభావతమ్మ పాపిరెడ్డి, రాజ పేట సర్పంచ్‌ మాధవరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్లు బాలచంద్రయ్య, సుదర్శన్‌రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, ఎల్లపు రాములు, కురుమయ్య, రొట్టెల ఆంజనేయులు, సంజీ వ సాగర్‌, సత్యనారాయణరెడ్డి, గ్రామ నాయకులు శ్రీను, విష్ణువర్దన్‌రెడ్డి, చంద్రయ్య ఉన్నారు.


 

Read more