మైనార్టీ గురుకుల పాఠశాలను పట్టణంలోకి మార్చండి

ABN , First Publish Date - 2022-11-11T23:13:14+05:30 IST

మండలంలోని జగత్‌పల్లి శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల బాలికల విద్యాలయాన్ని గతంలో నిర్వహించిన పాత భవనంలోకి మార్చాలని శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు.

మైనార్టీ గురుకుల పాఠశాలను పట్టణంలోకి మార్చండి
ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయిస్తున్న పోలీసులు

పెద్దమందడి, నవంబరు 11: మండలంలోని జగత్‌పల్లి శివారులో ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల బాలికల విద్యాలయాన్ని గతంలో నిర్వహించిన పాత భవనంలోకి మార్చాలని శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. పాఠశాల భవనం వ్యవసాయ పొలాల్లో ఉండటంతో విష పురుగులు వస్తాయని, విద్యార్థులు భయందోళనతో పాఠశాలలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాత భనంలోకి మార్చాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-11T23:13:14+05:30 IST

Read more