మోగనున్న.. బడిగంట

ABN , First Publish Date - 2022-06-13T04:10:33+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి బడిగంట మోగనుంది. కరోనా కేసులు పెరగడం, జూన్‌ నెల సగం గడిచినా వేసవి తీవ్రత తగ్గకపో వడం, పాఠ్యపుస్తకాలు రాకపోవడం వంటి కారణాలతో సెలవులు మరో వారం పొడగిస్తారనే ప్రచారం సాగింది.

మోగనున్న.. బడిగంట
గండీడ్‌ మండలం చిన్నవార్వాల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

నేటి నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు

రెండేళ్ల తర్వాత జూన్‌లో తెరుచుకోనున్న స్కూల్స్‌

పూర్తి స్థాయిలో అందని పుస్తకాలు

రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మీడియం తరగతులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరవనున్న 4.19 లక్షల మంది విద్యార్థులు


కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత రెండేళ్ల అనంతరం సోమవారం నుంచి విద్యా సంవత్సరం మొదలుకానుంది. ఆన్‌లైన్‌ తరగతులు, సాగని పాఠశాలలతో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు ఈ యేడాది ఎన్నో ఆశలతో స్కూల్స్‌ గడప తొక్కనున్నారు. అయితే నేటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందకపోవడం ఆందోళన కలిగిస్తుండగా, ఈ ఏడాది నుంచి ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టడం ఆనందకరమైన విషయం. కరోనా కేసులు పెరుగుతుండటంతో కొవిడ్‌ నిబంధనల మధ్య తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి బడిగంట మోగనుంది. కరోనా కేసులు పెరగడం, జూన్‌ నెల సగం గడిచినా వేసవి తీవ్రత తగ్గకపో వడం, పాఠ్యపుస్తకాలు రాకపోవడం వంటి కారణాలతో సెలవులు మరో వారం పొడగిస్తారనే ప్రచారం సాగింది. అయితే స్కూల్స్‌ పునఃప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో ప్రకటిం చడంతో సోమవారం నుంచి బడిగంట మోగించేందుకు అధికారులు, ఉపాధ్యా యులు సిద్ధమయ్యారు. వారం రోజులుగా కరోనా కేసులు స్వల్పంగా నమోద వుతుండడంతో పాఠశాలలను కరోనా నిబంధనల మేరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే రెండు విద్యాసంవత్సరాలు పూర్తిగా దెబ్బతినడంతో ఈసారి నిబంధన లతోనైనా ఇబ్బంది లేకుండా స్కూళ్లు నడ పాలనే నిర్ణయానికి ప్రభు త్వం వచ్చింది. ప్రధానంగా 2020-21లో కేవలం రెండు నెలలు ఫిబ్రవరి, మార్చిలో మాత్రమే స్కూళ్లు నడిపిస్తే, 2021-22లో సెప్టెంబరు నుంచి పాఠశాలలను నిర్వహించారు. అయితే చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమయ్యారు. ప్రతీ స్కూల్‌లో శానిటైజర్‌ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోనున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందకుండా విద్యాబోధన కొనసాగిండమే ప్రధాన లక్ష్యంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా భయంతో పిల్లలను స్కూళ్లకు పంపకుండా ఉండొద్దని, అందరూ సోమవారం నుంచే స్కూళ్లకు రావాలని పేర్కొన్నారు. 


పారిశుధ్య నిర్వహణ బాధ్యత పంచాయతీలదే

పాఠశాలల్లో స్కావెంజర్లు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకే అప్పగించింది. ప్రారంభానికి ఇప్పటికే ఆయా పంచాయతీల కార్మికులు స్కూళ్లను సిద్ధం చేశారు. రోజూ స్కూళ్లలో స్వీపింగ్‌, క్లీనింగ్‌ జరిగేలా ఏర్పాట్లు చేశారు. అయితే హైస్కూళ్లలోనైనా కనీసం స్కావెంజర్లను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ మాత్రం వినిపిస్తోంది. 


ఈఏడాది నుంచి మాధ్యమం బోధన

ఈ ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పాఠ్య పుస్తకాలు ఆంగ్ల భాషలోనూ ప్రచురించారు. ఇందువల్లే ప్రచురణ జాప్యం జరుగుతుండడంతో విద్యార్థులకు ఇంకా పుస్తకాలు అందని పరిస్థితి నెలకొంది.


బడి మెట్లెక్కనున్న విద్యార్థులు

పాలమూరు ఐదు జిల్లాల్లో మొత్తం 3,666 ప్రభుత్వ పాఠశాలలుండగా, అందులో 4,19,246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరంతా సోమ వారం పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అత్యధికంగా మహ బూబ్‌నగర్‌ జిల్లాలో 1,206 స్కూళ్లుంటే 1,49,611 మంది విద్యార్థులు ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 825 స్కూళ్లకు 71,130 మంది, నారాయణపేట జిల్లాలో 500 స్కూళ్లకు 68,505 మం ది, జోగులాంబ గద్వాల జిల్లాలో 617 స్కూళ్లకు 72,000 మంది, వనపర్తిలో 518 స్కూళ్లకు 58,000 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల కు ఇంకా 80 శాతం మేర పాఠ్యపుస్తకాలు అందలేదు. అదే సమయంలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడంతో బోధన సాగే తీరుపై కొంత ఉత్సుకత కనిపిస్తోంది. స్కూల్‌ యూనిఫామ్స్‌కు సంబంధించిన వస్త్రం కూడా జిల్లాలకు రాకపోవడం గమనార్హం. 

Updated Date - 2022-06-13T04:10:33+05:30 IST