అభివృద్ధి, ఆరోగ్యం మోదీ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-29T05:47:56+05:30 IST

భారతదేశ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

అభివృద్ధి, ఆరోగ్యం మోదీ లక్ష్యం
వైద్యశిబిరంలో మందులను పంపిణీ చేస్తున్న డీకే అరుణ

- భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  

-  గద్వాలలో మెగా వైద్య శిబిరం

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 28 :  భారతదేశ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా గద్వాల పట్టణంలో బుధవారం నిర్వహిం చిన మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సంద ర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంతో స్వదేశీ ఉత్పత్తులకు అధిక ప్రోత్సాహాన్ని ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, కరోనాతో ఎదురైన ఇబ్బందులను అధిగమిం చేందుకు ఆత్మ నిర్భర్‌ నినాదంతో ఆర్థిక ఆలంబన, పారిశ్రామిక పురోగతికి ఊతంగా నిలిచిందన్నారు. అదే సమ యంలో ప్రజలకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లు తలెత్తరాదని, వైద్యచికిత్స ఆర్థికభారం కాకూడ దన్న సదుద్దేశంతో జన ఔషధ సంస్థ ద్వారా పేదలకు తక్కువ ధరకే మందులను అందించేం దుకు కార్యాచరణ సిద్ధం చేశారన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతీ మండలంలో జనరిక్‌ మెడిసెన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదన అమలు కానుం దన్నారు. అందులో భాగంగా సేవా పక్షోత్సవాలను పురస్కరించుకొని ఉచిత వైద్యశిబిరంతో పాటు, రక్తదాన శిబిరాల నిర్వహణ, మొక్కలు నాటడం, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలి పారు. సేవా కార్యక్రమాలు అక్టోబరు రెండున మహాత్మాగాంధీ జయంతి వరకు కొనసాగుతాయ న్నారు. అనంతరం వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి డీకే అరుణ చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు. శిబిరంలో భాగంగా  ఓకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదంతో గద్వాల చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రామ లింగేశ్వర కామ్లే, జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్సి మ్యాడం రామకృష్ణల ఆధ్వర్యం లో చేనేత ఉత్పత్తుల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. శిబిరానికి హాజరైన వారి కోసం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్లు కృష్ణవేణి, పద్మావతి, రమాదేవి, నాయకులు రామాంజనేయులు, బండల వెంకట్రాములు,  మై నార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌బాషా, మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, కుమ్మరి శ్రీనివాసులు, త్యాగరాజు, నాగేంద్రయాదవ్‌, నరసింహులు, రామాంజి, తుమ్మల నరసింహులు, భాస్కర్‌ యాదవ్‌తో పాటు, జన ఔషధి సంస్థ రాష్ట్ర ప్రతి నిధి రమణారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర వైద్య విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ సమత, వైద్యులు చుక్కా సుదర్శన్‌, మోహన్‌రావు, భార్గవ్‌ దిన్ని, నర్మదా రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు.  


ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

కేటీదొడ్డి : మండల పరిధిలోని పాతపాలెంలో కొత్తగా నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బుధ వారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆల యాన్ని ప్రారంభించి 45 రోజులైన సందర్భంగా గ్రామస్థులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మిర్జాపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సంజీవ్‌ భరధ్వజ్‌, తిమ్మరెడ్డి, పద్మారెడ్డి, ఎం.పద్మారెడ్డి, దేవేందర్‌రెడ్డి, మార్కశీను, వెంకటేశ్వర్‌రెడ్డి, శేఖర్‌ రెడ్డి, కిష్టన్న, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Read more