భూత్పూర్‌లో అభిమానుల మధ్య భారీ కేక్‌ను కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే దంపతులు

ABN , First Publish Date - 2022-10-01T05:15:06+05:30 IST

భారీ జనసందోహం మధ్య ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి.

భూత్పూర్‌లో అభిమానుల మధ్య భారీ కేక్‌ను కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే దంపతులు
భూత్పూర్‌లో అభిమానుల మధ్య భారీ కేక్‌ను కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే దంపతులు

-  ఘనంగా ఎమ్మెల్యే ఆల వెంటేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

- శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ 

- భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు, కార్యక్తర్తలు

- శ్రీరామ లింగేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల పూజలు

భూత్పూర్‌, సెప్టెంబరు 30 : భారీ జనసందోహం మధ్య ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మునిసిపాలిటీ కేంద్ర పరిధిలో ఉన్న శ్రీరామ లింగేశ్వరస్వామి దేవాలయంలో శివుడికి ప్ర త్యేక అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు, కుటుంబ సభ్యులకు ఆశీర్వచనలు అందించారు. అక్కడే మంత్రి నిరంజన్‌రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని కలిసి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వుర్ణాసుధాకర్‌రెడ్డి, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, భూత్పూర్‌ సీఐ రజితారెడ్డి, ముఖ్య నాయకులు ఎమ్మెల్యేకు పూలమొక్కలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుం చి ఎమ్మెల్యే అభిమానులు, కార్యక్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా బయ లుదేరి స్థానిక కేఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు. అక్కడ అభిమా నుల మధ్య ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మంజుల దంపతులు, కుటుంబ సభ్యు ల మధ్య భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజవ ర్గంలోని అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చిన పార్టీ ముఖ్యనాయకులు, అభిమానులు, ప్రజా ప్రతినిఽధులు ఆలకు జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. అంతకు ముందు అక్కడే ఫంక్షన్‌ హా ల్‌లో ఏర్పాటు చేసి న రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పరిశీలిం చారు. అదే విధంగా హైదరా బాద్‌లోని యశోద ఆసుపత్రివారి ఆధ్వర్యం లో వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న అభిమా నులతో వట్లాడారు. సాయంత్రం ఐదు గంటల వరకు జనసందోహంతో ఫంక్షన్‌హాల్‌ కిటకిటలాడింది. అన్నదానం ఏర్పాటు చేశారు. అక్కడి నుం చి స్థానిక మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ నరేష్‌ కు మార్‌గౌడ్‌, జిల్లా మత్స్య సహకార సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి సత్యనారా యణ, సింగిల్‌విండో చైర్మన్‌ అశోక్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు నారా యణగౌడ్‌, మురళీధర్‌గౌడ్‌, అశోక్‌గౌడ్‌, మేకల సత్యనారాయణ, పార్టీ పట్టణఅధ్యక్షుడు ముసా బాలస్వామి, సురేష్‌ కుమార్‌గౌడ్‌,  ముడా డైరె క్టర్లు చంద్రశేఖర్‌గౌడ్‌, సాయిలు, వార్డు కౌన్సిలర్లు శ్రీనివాస్‌ రెడ్డి, రామ కృష్ణ, గిరిజన సంఘం నాయకులు మాన్య నాయక్‌, రాము నాయక్‌, ఆంజనేయులు, వివిధ మండలాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యక్తలు, అధికారులు, పాల్గొన్నారు.

అడ్డాకులలో వేడుకలు

అడ్డాకుల : మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను      ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు టి.శ్రీనివాస్‌రెడ్డి కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ ఖాజాఘోరి, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్‌ పాల్గొన్నారు.

ఘనంగా ఆల జన్మదినం

చిన్నచింతకుంట : మండలంలో శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహిం చారు. మద్దూర్‌లో కేక్‌ కట్‌ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో మాతా గంగాభవాని ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహం వద్ద ఆల యువసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫరూక్‌, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు ప్రదీప్‌రెడ్డి, చింతకుంట ఆల యువసేన కార్యకర్తలు రియాజ్‌, వరప్రసాద్‌, సంజీవ, వినోద్‌, దాసరి వెంకటేష్‌ పాల్గొన్నారు.  

Read more