గౌరిదేవిపల్లిలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల

ABN , First Publish Date - 2022-03-17T05:27:53+05:30 IST

మండలంలోని గౌరిదేవిపల్లిలో రూ.10లక్షల వ్యయం తో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బుధవారం సీసీ రోడ్డును ప్రారంభించారు.

గౌరిదేవిపల్లిలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల
గౌరిదేవిపల్లిలో సీసీరోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

అడ్డాకుల, మార్చి 16 : మండలంలోని గౌరిదేవిపల్లిలో రూ.10లక్షల వ్యయం తో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బుధవారం సీసీ రోడ్డును ప్రారంభించారు. అదే విధంగా కట్టపై ఉన్న పోచమ్మ దేవాలయం కోసం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


సీఎం సహాయ నిధి చెక్కు అందించిన మంత్రి 


అనారోగ్యంతో బాధపడుతూ మండలంలోని బలీదుపల్లి గ్రామానికి చెందిన వడ్డె రాజు అనే వ్యక్తి ముఖ్యమంత్రి సహాయ నిధికోసం దరఖాస్తు చేసుకున్నా డు. స్పందించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం బాధితుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించాడు. ఈ సందర్భంగా బాధితుడు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read more