నిధుల దుర్వినియోగంపై రగడ

ABN , First Publish Date - 2022-09-29T05:51:14+05:30 IST

అధికారులు, సిబ్బంది నిధులను దుర్వినియోగం చేశారని సహ కార సొసైటీ అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డి ఆరోపించారు.

నిధుల దుర్వినియోగంపై రగడ
సంఘం సభ్యులకు వివరాలు తెలుపుతున్న సీఈవో మద్దిలేటి

- రసాభాసగా సహకార సొసైటీ సర్వసభ్య సమావేశం

- రాజీనామా చేసిన సీఈవో

వడ్డేపల్లి, సెప్టెంబరు 28 : అధికారులు, సిబ్బంది నిధులను దుర్వినియోగం చేశారని సహ కార సొసైటీ అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డి ఆరోపించారు. మునిసిపాలిటీ కేంద్రమైన శాంతి నగర్‌లో బుధవారం సహకార సొసైటీ సంఘం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అందులో భాగంగా 2021-22 అర్ధ సంవత్సరం జమా ఖర్చులు ఆమోదించడంతో పాటు, అంచనా బడ్జెట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా నిధుల దుర్విని యోగంపై సంఘం డైరెక్టర్లు మల్లికార్జున్‌, వెంకట్రా ములు గౌడ్‌ సీఈవో మద్దిలేటిని నిలదీశారు. అందుకు సీఈవో స్పందిస్తూ సహకార సొసైటీకి చెందిన రూ.9,47,294 తానే వాడుకున్నానని తెలిపారు. నూతన సభ్యులు 105 మందితో రూ.333 చొప్పున సభ్యత్వం రుసుమును కూడా తానే వసూలు చేసుకున్నానని చెప్పారు. ఈ డబ్బును బ్యాంకులో జమ చేయలేదని వివరించారు. ఆ డబ్బును త్వరలోనే తిరిగి చెల్లిస్తానని సమాధానమిచ్చారు. తనకు ఆరోగ్యం సహకరించ నం దున సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్తూ, సహకార సొసైటీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డికి లేఖను అందజేశారు. సహకార సొసైటీలో నిధులు, ఖర్చులను రికార్డులో రాసి చూపించాలని డైరెక్టర్లు అధికారులను కోరారు. అనంతరం ఇన్‌చార్జి సీఈవోగా రవికుమార్‌, స్టాఫ్‌ అసిస్టెంట్‌గా రాంబాబును నియమిస్తు న్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, డైరెక్టర్లు మల్లి కార్జున్‌, వెంకట్రా ములు గౌడ్‌, తిమ్మక్క, రాముడు సిబ్బంది శ్రీనివాసులు, రాము, శివ, తిమ్మన్న పాల్గొన్నారు.


Updated Date - 2022-09-29T05:51:14+05:30 IST