ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-31T04:46:19+05:30 IST

మండల పరిధిలోని దవాజిపల్లి గ్రామానికి చెందిన చాకలి దేవేంద్రమ్మ(44) ఆదివారం అర్ధరాత్రి గుడిసెలో గుంజకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నాగన్న తెలిపారు.

ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య
దేవేంద్రమ్మ (ఫైల్‌)


పాన్‌గల్‌, మే 30: మండల పరిధిలోని దవాజిపల్లి గ్రామానికి చెందిన చాకలి దేవేంద్రమ్మ(44) ఆదివారం అర్ధరాత్రి గుడిసెలో గుంజకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నాగన్న తెలిపారు. కుటుంబ పోష ణ, ఆర్థిక ఇబ్బందులతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మృతురాలికి భర్త రాజబాబు, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై తెలిపారు. 

ఉండవల్లిలో యువకుడు..


ఉండవల్లి : మండల కేంద్రానికి చెందిన యువ కుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మం డల కేంద్రానికి చెందిన మద్దిలేటి, లక్ష్మిదేవిల కుమా రుడు మధుశేఖర్‌(23) సెంట్రింగ్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి పని చేయకుండా జులాయిగా తిరుగుతుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన మధు శేఖర్‌ ఆదివారం రాత్రి 10గంటల తర్వాత తన గది లోకి వెళ్లాడు. సోమవారం ఉదయం తల్లి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే అతను ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్సై జగన్‌మోహన్‌ తెలిపారు.Read more