అంబచెరువు వాగులో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-10-19T04:23:47+05:30 IST

మండలంలోని రాజనగరం అంబ చెరువు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

అంబచెరువు వాగులో పడి వ్యక్తి మృతి
నాగరాజు (ఫైల్‌)


వనపర్తి అర్బన్‌, అక్టోబరు 18: మండలంలోని రాజనగరం అంబ చెరువు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్సై యుగంధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూర్‌ పట్టణానికి చెందిన జిందే నాగరాజు(45) అనే వ్యక్తి ఈనెల 15న ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం భార్య, కుమారు డితో కలిసి వనపర్తికి వచ్చారు. చికిత్స చేయించుకున్నాక అతను వారికి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఆరోజు నుంచి చుట్టు పక్కల  ఎంత వెతికినా వారి కుటుంబ సభ్యులకు కనిపించలేదు. మంగళవారం అంబ చెరువు వాగులో ఓ వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇ చ్చారు. ఎస్సై యుగంధర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Read more