ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించండి

ABN , First Publish Date - 2022-11-27T23:27:22+05:30 IST

గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియను వేగ వంతం చేయాలని, అదే విధంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించా లని అధికారులను జిల్లా వెంకట్రావు ఆదేశించారు.

ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించండి
అమిస్తాపూర్‌లో ఓటరు నమోదుపై పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

- అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ వెంకట్రావు

భూత్పూర్‌, నవంబరు 27 : గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియను వేగ వంతం చేయాలని, అదే విధంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించా లని అధికారులను జిల్లా వెంకట్రావు ఆదేశించారు. ఆదివారం ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన మునిసిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌, భూ త్పూర్‌ పట్టణాల్లో కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు నమోదు ప్రక్రియ ఎందుకు వేగంగా సాగడం లేదని తహసీల్దార్‌ చెన్నకిష్టన్నను జిల్లా కలెక్టర్‌ ప్రశ్నించారు. ఓటరు నమోదుపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన తీసుకోరావాలని సూచించారు. అనంతరం భూత్పూర్‌ మునిసి పాలిటీ లోని చౌరస్తా ప్రాంతాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. పచ్చధనం, పరిశుభ్రత పాటించాల ని మునిసిపాలిటీ కమిషనర్‌ నూరుల్‌ నజీబ్‌ను ఆదేశించారు. అదేవిధంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చౌరస్తాలో ఎక్కడ కూడా చెత్త లేకుండా పరిశుభ్రతను పాటించాలని, బహిరంగ మల, మూత్ర విసర్జనను పూర్తిగా నిర్మూలించాలని, ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిఽధులు చొరవ చూపాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈయన వెంట తహసీల్దార్‌ చెన్నకిష్టన్న, ఆర్‌ఐ సత్యం, మునిసిపల్‌ కమిషనర్‌ నూరుల్‌ నజీబ్‌, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:27:26+05:30 IST