‘దళితబంధు’తో జీవితాల్లో వెలుగు

ABN , First Publish Date - 2022-12-12T22:58:50+05:30 IST

: దళితబంధు పథకం ద్వారా దళితులకు ఆర్థిక తోడ్పాటునందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

‘దళితబంధు’తో జీవితాల్లో వెలుగు
దళితబంధు యూనిట్‌ను ప్రారంభించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే అబ్రహాం

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

వడ్డేపల్లి, డిసెంబరు 12 : దళితబంధు పథకం ద్వారా దళితులకు ఆర్థిక తోడ్పాటునందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. దళిత బంధు యూనిట్‌ కింద మానవపాడు మండలంలోని ఏ.బూడిద పాడు గ్రామానికి చెందిన రమేష్‌ శాంతినగర్‌లో ఏర్పాటు చేసుకున్న గార్మెంట్‌ షాపును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళితుల సామాజికాభి వృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలబడుతోందన్నారు. దళితబంధు పథకం ద్వారా లబ్ధి చేకూర్చడమే కాకుండా పరోక్షంగా మరో నలుగురుకి ఉపాధి కల్పిస్తోందన్నారు. దళితులు ఈ పథకం ద్వారా లబ్ధిపొంది సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణ, జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, రైతు సమ న్వయ సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్‌ రెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ రఘునందర్‌ రెడ్డి, పట్టణ అధ్య క్షుడు సూరి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, సర్పంచ్‌లు తిమ్మప్ప, సవారీ, ఎంపీటీసీ సభ్యులు మన్సూర్‌ గౌడ్‌, కృపానందం, ఆర్డీఎస్‌ ఆయకట్టుదారుల సంఘం మాజీ చైర్మన్‌ సీతారాంరెడ్డి, ఉండవల్లి మండల అధ్యక్షుడు రమణగౌడ్‌, నాయకులు మహేష్‌, రవిరెడ్డి, మహారాజు, సుంకన్న పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు ఘన సన్మానం

వడ్డేపల్లి : శాసనసభ్యుడిగా ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్ర హాంను సోమవారం వడ్డేపల్లి మండల ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాటా డుతూ నియోజకవర్గ బాధ్యులు, మండలాల నాయ కులు, కార్యకర్తల అండ, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. అలంపూర్‌, వడ్డేపల్లి, శాంతినగర్‌ ప్రాంతాల అభివృద్ధికి శాయ శక్తులా కృషి చేసినట్లు తెలిపారు. నాయకులు, ప్రజల అండదండలతో భవిష్యత్‌లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

అనుక్షణం ప్రజల మధ్యనే ఉంటా

ఎర్రవల్లి చౌరస్తా : అనుక్షణం ప్రజల మధ్య ఉండి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. ఇటిక్యాల మండల పరిధిలోని సాతర్ల, షాబాద్‌, ఉదండాపురం, వేముల గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలంపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, షాబాద్‌ ఎంపీటీసీ సభ్యుడు తిరుపతి రెడ్డి, నాయకులు కేశన్న. దానం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T22:58:50+05:30 IST

Read more