భర్తను చంపిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష

ABN , First Publish Date - 2022-12-12T23:18:44+05:30 IST

తాళికట్టిన భర్తను అతికిరాతకంగా హత్యచేసి కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భార్య జి.గంగమ్మకు యావజ్జీవ కఠినకారాగార శిక్ష, జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్‌ జడ్జి ఎస్‌ ప్రేమావతి సోమవారం తీర్పుచెప్పారు.

భర్తను చంపిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష

మహబూబ్‌నగర్‌ లీగల్‌కంట్రిబ్యూటర్‌, డిసెంబరు12: తాళికట్టిన భర్తను అతికిరాతకంగా హత్యచేసి కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భార్య జి.గంగమ్మకు యావజ్జీవ కఠినకారాగార శిక్ష, జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్‌ జడ్జి ఎస్‌ ప్రేమావతి సోమవారం తీర్పుచెప్పారు. జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బెక్కెం జనార్దన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2016 సెప్టెంబరు7న మహబూబ్‌నగర్‌ మండలం కోడూర్‌ గ్రామానికి చెందిన తెలుగు రాములు భార్య జి. గంగమ్మ అర్ధరాత్రి తన భర్త రాములుపై కిరోసిన పోసి నిప్పంటించింది. ఆర్తనాదాలు పెడుతున్నా భర్త బయటకు రాకుండా గడియ పెట్టి పక్కింటిలో ఉంటున్న రాములు తమ్ముడు రామస్వామి వద్దకు వెళ్లి మీ అన్న ఆత్మహత్యకు ప్రయత్నం చేశా డని మాయమాటలు చెప్పింది. రాములు అరుపులకు పక్కింటివాళ్లు వెళ్ళి చూడగా తన భార్యనే తనను అడ్డు తొలగించుకోవడానికి కిరోసిన్‌ పోసి నిప్పంటించిందని చెప్పగా 108 ఆంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. న్యాయమూర్తికి ఇచ్చిన వాం గ్మూలంలోనూ ఇదే విషయం చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేసి అప్పటి రూరల్‌ సీఐ వై రామకృష్ణ ఛార్జిషీట్‌ దాఖలు , ఎస్సై రాజేశ్వ ర్‌గౌడ్‌ సహకరించారు. ప్రాసిక్యూషన్‌ తరపున పీపీ బెక్కెం జనార్దన్‌ ఎనిమిది మంది సాక్షలును ప్రవేశపెట్టారు. వాద ప్రతివాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి ప్రాసిక్యూషన్‌ వాదనలతో ఏకీభవించి నిందితురాలు గంగమ్మ పై నేరం రుజువుకావడంతో హత్యానేరానికి యావజ్జీవ కఠిన కారాగార జైలుశిక్ష రూ.ఐదువేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చారు.

Updated Date - 2022-12-12T23:18:44+05:30 IST

Read more