వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం

ABN , First Publish Date - 2022-09-09T04:49:00+05:30 IST

వైఎస్‌ఆర్‌టీపీ అధికారం చేపడితే తెలంగాణలో వ్యవసాయ రం గాన్ని పండుగలా మారుస్తానని, ఇల్లు లేని నిరుపేదలందరికి పక్కా ఇల్లు మంజూరు చేస్తామని, రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజల్లో వెలుగులు నింపుతామని వైఎస్‌ఆర్‌టీపీ వ్యవ స్థాపకురాలు షర్మిల అన్నారు.

వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం
పాదయాత్రగా పొలికపాడ్‌ గ్రామానికి చేరుకున్న షర్మిల

- బెల్టుషాపుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌ 

- వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల 

- గోపాల్‌పేట మండలానికి చేరిన షర్మిల పాదయాత్ర 


గోపాల్‌పేట, సెప్టెంబరు 8: వైఎస్‌ఆర్‌టీపీ అధికారం చేపడితే తెలంగాణలో వ్యవసాయ రం గాన్ని పండుగలా మారుస్తానని, ఇల్లు లేని నిరుపేదలందరికి పక్కా ఇల్లు మంజూరు చేస్తామని, రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజల్లో వెలుగులు నింపుతామని వైఎస్‌ఆర్‌టీపీ వ్యవ స్థాపకురాలు షర్మిల అన్నారు. గురువారం గోపాల్‌పేట మండలంలోని పొలికపాడ్‌ గ్రామానికి సాయంత్రం ఏడు గంటలకు పాదయాత్రగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స మావేశంలో మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి ఉద్యోగం కల్పించి బంగారు తెలంగాణ రాష్ట్రంగా మారుస్తానన్న కేసీఆర్‌ నేడు గ్రామాల్లో 24 గంటలు మద్యంతో బెల్టుషాపులను సృష్టించి తెలం గాణను భ్రష్టు పట్టించాడని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా పేదల రక్తా న్ని పిండుకుంటున్నాడని అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మనను మోసం చేస్తు వ స్తున్నాయని అలాంటి పార్టీలకు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. వారి ఇచ్చే డబ్బులు తీసుకోండి.. వారు పంచి పెట్టే డబ్బులన్ని మీవేనని తెలిపారు. ప్రస్తుత పాలనలో అందరు దొంగలేనని వా రికి తగిన బుద్ది చెప్పాలంటే  మనలో చైతన్యం రావాలని తెలిపారు. పింఛన్లు రావడం లేదని మహిళలు షర్మిలమ్మతో మొర పెట్టుకున్నారు. వనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ బూజల వెంక టేశ్వర్‌రెడ్డి, జిల్లా నాయకులు తిరుపతయ్య, శ్యాం, పిట్ట రాంరెడ్డి, నీలం రమేష్‌, సత్యవతి, కాం తయ్య, రాజశేఖర్‌, రామాంజనేయులు, ప్రనయ్‌కుమార్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

  నేడు గోపాల్‌పేట మండలంలో షర్మిల పాదయాత్ర 

గోపాల్‌పేట మండల కేంద్రంలోని దన్‌సింగ్‌తండా, గోపాల్‌పేట, తాడిపర్తి, సింగాయపల్లి గ్రా మాల గుండా వనపర్తికి పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు తెలిపారు.

Updated Date - 2022-09-09T04:49:00+05:30 IST