బీజేపీని గద్దె దించేవరకు పోరాడుదాం

ABN , First Publish Date - 2022-09-30T05:04:31+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు ఎంతటి ఉద్యమాన్నైనా చేపట్టి పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు.

బీజేపీని గద్దె దించేవరకు పోరాడుదాం
సమావేశంలో మాట్లాడుతున్న కూనమనేని సాంబశివరావు

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు


వనపర్తి టౌన్‌, సెప్టెంబరు 29: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు ఎంతటి ఉద్యమాన్నైనా చేపట్టి పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో పార్టీ జిల్లా కార్యదర్శి విజయరాములు అధ్య క్షతన సీపీఐ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరి గింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ యన మాట్లాడుతూ బీజేపీని గద్దె దించడం కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతామని, అందుకోసమే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామని అన్నారు. ము నుగోడులో పొత్తు కేవలం రాజకీయ ఎత్తుగడ మా త్రమేనని, టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆధారాలుంటే ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాటం తప్పదని అన్నారు. బీజేపీని ఇంటికి సాగ నంపడం కోసం వ్యతిరేక పార్టీలన్ని ఏకమవుతున్నా యని, ఆ పార్టీకి పతనం తప్పదని జోస్యం చెప్పా రు. రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల పెం డింగ్‌పై పరిస్థితులను అంచనా వేసి పూర్తి చేయా లని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు బాలనరసింహ, భారత జాతీయ మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కళావతమ్మ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీరాం, నాయకులు పాల్గొన్నారు. 


Read more