అయ్యప్ప నామస్మరణతో దద్దరిల్లిన కొల్లాపూర్‌

ABN , First Publish Date - 2022-12-09T23:19:55+05:30 IST

అయ్యప్పస్వామి నామస్మ రణంతో శుక్రవారం కొల్లాపూర్‌ పట్టణం దద్దరిల్లింది.

 అయ్యప్ప నామస్మరణతో దద్దరిల్లిన కొల్లాపూర్‌
అయ్యప్పస్వామి పల్లకిని మోస్తున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చిత్రంలో ఆయన తల్లి బిచ్చమ్మ

- కనుల పండువగా మహాపడిపూజ

- ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగిన పూజలు

కొల్లాపూర్‌, డిసెంబరు 9: అయ్యప్పస్వామి నామస్మ రణంతో శుక్రవారం కొల్లాపూర్‌ పట్టణం దద్దరిల్లింది. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వ హించిన మహాపడి పూజ వైభవంగా కనుల పండు వగా కొనసాగింది. శుక్రవారం ఉదయం పట్టణంలోని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి నివాస గృహం నుంచి అయ్యప్పస్వామి పల్లకి సేవతో ప్రారంభమైన మహాప డి పూజ సాయంత్రం వరకు వేద పండితుల మంత్రో చ్ఛారణల మధ్య శబరిమలై ఆలయ పూజారులతో ఘ నంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి పల్లకి సేవను ఎమ్మెల్యే బీరం తన నివాస గృహం నుంచి పట్టణంలో ని ఎల్లూరు రహదారిలో ఉన్న అయ్యప్పస్వామి ఆల యం వరకు ఊరేగింపు నిర్వహించారు. మహాపడి పూజ సందర్భంగా రంగురంగుల పూలతో ప్రాంగణాన్ని ఘనంగా అలంకరించారు. ఎమ్మెల్యే బీరం దంపతులు అయ్యప్పస్వామి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించా రు. పదునెట్టంబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన బృందం, ఆర్కెస్ర్టా, దేవతా మూర్తుల వేషధారణ తో కళాకారులు నృత్యాలను కొనసాగించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్పస్వాములు, భక్తులు మహాపడి పూజలో పాల్గొన్నారు. ధర్మశాస్త అ య్యప్పస్వామి మహాపడి పూజ బ్రహ్మాశ్రీసుధీర్‌నా మ్‌ బుద్రి శబరిమలై మేల్‌ శాంతి ఆధ్వర్యంలో మ హాపడిపూజ మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత భకి ్తశ్రద్ధలతో కనుల పండువగా కొనసాగింది. అనంత రం అయ్యప్ప స్వాములకు, భక్తులకు తీర్థప్రసాదా లు, అన్నదానం నిర్వహించారు. అయ్యప్పస్వామి కరుణ కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Updated Date - 2022-12-09T23:19:56+05:30 IST