-
-
Home » Telangana » Mahbubnagar » KCR family rule will end soon-MRGS-Telangana
-
త్వరలో కేసీఆర్ కుటుంబ పాలన అంతం
ABN , First Publish Date - 2022-09-20T05:11:05+05:30 IST
తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన అంతం కానుందని బీజేపీ నియెజకవర్గం ఇన్చార్జి రతంగ్‌పాండురెడ్డి అన్నారు.

- బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రతంగ్‌పాండు రెడ్డి
- మరికల్లో ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్ర
మరికల్,సెప్టెంబర్ 19 : తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన అంతం కానుందని బీజేపీ నియెజకవర్గం ఇన్చార్జి రతంగ్‌పాండురెడ్డి అన్నారు. సోమ వారం మరికల్ మండల పరిధిలోని తీలేరులో ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి బైక్‌ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ వెంకటాపూర్, పెద్దచింతకుంట, రాకొండ, పల్లెగడ్డ, పూసల్పహుడ్, మాధరం, ఇబ్రహ్నింపట్నం, మరికల్, అప్పంపల్లి గ్రా మాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా పలుగ్రామాలో జరిగిన సభలో అయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియమకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కానీ, ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో తన కుటుంబమే బంగారు కుటుంబంగా మారిందని, తన కుటుంబ సభ్యులకే రాజకీయ ఉద్యోగాలు కల్పిం చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన వలన ప్రజలు విసిగి పోయారని ఆరోపించారు. ఈసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ హయాంలో అభివృద్ధి పరుగు పెడుతోందన్నారు. కరోనా మహ్మరి సమయంలో ప్రపంచంలోనే మన దేశంలో వ్యాక్సిన్ కనిపెట్టి దేశ ప్రజలందరికి ఉచితంగా వేయించారన్నారు. రాబోయే ఎన్ని కల్లో ప్రజలే కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు. కా ర్యక్రమంలో చిన్ననర్సన్గౌడ్, తిరుపతిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వేణు, రమేష్, శ్రీరామ్, వెంకటేష్, నారాకొండయ్య, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.