మత్స్యకారులకు ఊపిరి పోసిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-30T05:08:30+05:30 IST

రాష్ట్రంలోని మత్స్యకారులకు కేసీఆర్‌ ఊపిరి పోశారని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. గురువారం అలంపూర్‌ మండల పరిధిలోని గొందిమల్ల సర్పంచు వసుంధర పెద్దారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు షంషాద్‌ ఇస్మాయిల్‌, ఎంపీపీ బేగం గోకారిలతో కలిసి ఆయన కృష్ణానదిలో చేప పిల్లలను వదిలారు.

మత్స్యకారులకు ఊపిరి పోసిన కేసీఆర్‌
కృష్ణానదిలో చేపపిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే అబ్రహాం, సర్పంచ్‌ వసుంధర

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌, సెప్టెంబరు 29 : రాష్ట్రంలోని మత్స్యకారులకు కేసీఆర్‌ ఊపిరి పోశారని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. గురువారం అలంపూర్‌ మండల పరిధిలోని గొందిమల్ల సర్పంచు వసుంధర పెద్దారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు షంషాద్‌ ఇస్మాయిల్‌, ఎంపీపీ బేగం గోకారిలతో కలిసి ఆయన కృష్ణానదిలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచితంగా చేపపిల్లల పంపిణీతో మత్య్ససంపద పెరిగిందని చెప్పారు. అంతకుముందు ఆయన గొందిమల్ల గ్రామంలోని జుంకాలేశ్వరీ, మోనికాలేశ్వరీదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచు పుణ్యవతమ్మ, నాయకులు పెద్దారెడ్డి, నారాయణరెడ్డి, శేఖర్‌రెడ్డి, బీచుపల్లి, వెంకట్రామయ్యశెట్టి తదితరులు పాల్గొన్నారు. 


బాధితులకు పరామర్శ

ఉండవల్లి మండలంలోని బొంకూరు గ్రామ ఉప సర్పంచు  నారాయణ ఆనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం, ఆలయ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌ శ్రీలత భాస్కర్‌రెడ్డిలతో కలిసి గ్రామానికి వెళ్లారు. నారాయణ మృతదేహానికి నివాళి అర్పించారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కె.పౌల్‌ ఇటీవల విద్యుదాఘాతంతో గాయపడి కర్నూల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఆయనను ఎమ్మెల్యే అబ్రహాం పరామర్శించారు. అయన వెంట కొత్తపల్లి గోపాలకృష్ణయాదవ్‌ ఉన్నారు. 


పేదలకు కార్పొరేట్‌ వైద్యం

అలంపూర్‌ చౌరస్తా : సీఎం సహాయ నిధితో నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం అందుతోందని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. అలంపూర్‌ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బాధితుల కు సీఎం సహాయనిధి ఎల్‌వోసీలను అందించారు. మొత్తం 24 మందికి రూ.7,53500 విలువైన ఎల్‌ వోసీలను ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు సీతారాంరెడ్డి గోపాల్‌, రవి, జీవరత్నం, పరశు రాముడు పాల్గొన్నారు. 


‘దళితబంధు’తో ఆర్థికాభివృద్ధి

ఇటిక్యాల : దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు. మండలంలోని కొండేరు గ్రామంలో దళితబంధు లబ్ధిదారుడు ఎర్రన్న ఏర్పాటు చేసుకున్న ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని గురు వారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, సుం కన్న, ఈదన్న, సుందర్‌రాజ్‌, రవీందర్‌, ప్రేమ్‌ కుమార్‌, వీరబాబు పాల్గొన్నారు. 

Read more