సామాన్యులందరికీ న్యాయం చేరువ కావాలి

ABN , First Publish Date - 2022-11-30T23:17:47+05:30 IST

బలవంతులే కాకుండా బలహీనవర్గాలకు చెందిన సామాన్యులం దరికీ న్యాయం చేరువయ్యేలా సమాజంలోని వారందరూ కృషి చేయాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సబిత ఆకాంక్షించారు.

సామాన్యులందరికీ న్యాయం చేరువ కావాలి
న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి సబిత, చిత్రంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి స్వరూప

- జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సబిత

తాడూరు, నవంబరు 30: బలవంతులే కాకుండా బలహీనవర్గాలకు చెందిన సామాన్యులం దరికీ న్యాయం చేరువయ్యేలా సమాజంలోని వారందరూ కృషి చేయాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సబిత ఆకాంక్షించారు. బుధవారం మండలంలోని ఇంద్రకల్‌ గ్రామ రైతువేదికలో జిల్లా కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. సదస్సుకు జిల్లా సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి సబిత, మరొక న్యాయమూర్తి స్వరూప ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లా డారు. మనిషికి గల ఆధిపత్య ధోరణి వల్లే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. భూతగాదాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా గ్రామంలోనే కూలంకు షంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేని, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం చట్టపరంగా నేరమన్నారు. సదస్సులో శ్రీనివాస్‌గుప్తా, బార్‌ అసోసి యేషన్‌ ప్రెసిడెంట్‌, అడ్వకేట్లు రాజశేఖర్‌, శ్యాంప్రసాద్‌రావు, తాడూరు ఎస్సై శ్రీనివాసులు, సర్పంచ్‌ వెంకటరమణ, సింగిల్‌ విండో చైర్మన్‌ సమద్‌పాష, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:17:47+05:30 IST

Read more