బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-10-02T05:22:18+05:30 IST

జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యు ల నిర్లక్ష్యంతోనే బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు, బంధువులు శనివారం స్థానిక రాజీవ్‌చౌరస్తాలో గంటపాటు రాస్తారోకో చేశారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
రాస్తారోకో చేస్తున్న మృతురాలి బంధువులు

- బాలింత మృతిపై కుటుంబీకులు, బంధువుల ఆగ్రహం 

- రాజీవ్‌చౌరస్తాలో రాస్తారోకో 

- వాహనాల రాకపోకలకు అంతరాయం 

- మెడికల్‌ కాలేజీ సూపరింటెండెంట్‌ హామీతో ధర్నా విరమణ


వనపర్తి వైద్యవిభాగం, అక్టోబరు 1: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యు ల నిర్లక్ష్యంతోనే బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు, బంధువులు శనివారం స్థానిక రాజీవ్‌చౌరస్తాలో గంటపాటు రాస్తారోకో చేశారు. బా లింత కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాల రాక పోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. వనపర్తి సీఐ ప్రవీణ్‌ కుమార్‌ రాస్తారోకో వద్దకు చేరుకొని బాలింత కుటుం బీకులు, బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో మెడికల్‌ కాలేజీ సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌, డాక్టర్‌ రాజ్‌కుమార్‌లు వ చ్చి విచారణ చేసి, పొరపాటు చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించా రు. అనంతరం మృతదేహానికి సీఐ, ఎస్సై యుగంధర్‌ రెడ్డి, శివకుమార్‌, కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టు మార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

 జరిగిన తీరు ఇలా...

బాలింత మృతికి గల కారణాలను కుటుంబ సభ్యు లు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనా పూర్‌ మండలంలోని కొన్నూరు గ్రామానికి చెందిన 22 సంవత్సరాల సునిత మొదటి కాన్పు కోసం సెప్టెంబరు 29న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్ర సమీపంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు కా న్పు చేశారు. సునిత మగబిడ్డకు జన్మనిచ్చింది. మరు సటి రోజు బాలింత పరిస్థితి సీరియస్‌గా మారి దాదా పు 12 గంటల సమయంలో మృతి చెందింది. వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే తన భార్య మృతి చెందిం దని మృతురాలి భర్త ఆరోపిస్తున్నారు. 

 వైద్యుల వాదన మరోలా...

సునిత సెప్టెంబరు 26వ తేదీ రోజే ఆస్పత్రికి వచ్చా రని, అప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించడంతో గర్భిణీ పరిస్థితి ఇబ్బందిగా ఉందని, ఇలాంటి కేసులను హైరి స్కుగా పరిగణించాల్సి ఉంటుందని, వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు వైద్యులు తెలిపారు. గర్భిణీకి హైబీపీ ఉందని, కాన్పు సమయంలో ఇబ్బంది కలుగుతుందని ముందే హె చ్చరించినా కుటుంబ సభ్యులు వినకుండా ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయించలేదన్నారు. వైద్యులు చెబుతున్నా విన కుండా సంతకం చేసి ఇంటికి తీసుకెళ్లినప్పటికీ సంబం ధిత పీహెచ్‌సీ డాక్టర్‌కు, వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడం కూడా చేశామని అన్నారు. తీరా గర్భిణీ పరి స్థితి ఇబ్బందిగా మారిన తరువాత సెప్టెంబరు 29న ఆ స్పత్రికి తీసుకొచ్చారని అన్నారు. అయినప్పటికీ హై రిస్కు కేసుగా పరిగణనలోకి తీసు కుని ఆపరేషన్‌ చేసి కాన్పు చేశా మన్నారు. కాన్పు జరిగిన తరువాత ప్రి-ఎక్లాంప్సియా (గుర్ర పువాతం) రావడంతో బాలింత శరీరం మొత్తం నీరు వచ్చి మృతి చెందిందని, ఇందులో తమ నిర్ల క్ష్యం లేదని, కుటుంబ సభ్యుల ని ర్లక్ష్యంతోనే బాలింత మృతి చెంది నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ప్రి-ఎక్లాంప్సియా వ్యాధి చాలా కొద్ది మందిలో మాత్రమే వస్తుందని, విపరీతంగా బీపీ పెరగడంతో శరీ రం మొత్తం నీరు చేరి వాపు వ స్తుందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఊపిరాడక మృతి చెందుతారని వై ద్యులు తెలిపారు. 

Read more