జీవో 317ను సవరించాలి

ABN , First Publish Date - 2022-01-04T05:28:53+05:30 IST

జీవో నెంబరు 317ను సవరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు సాముల నాగరాజు డిమాండ్‌ చేశారు.

జీవో 317ను సవరించాలి
భూత్పూర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

జడ్చర్ల, జనవరి 3 : జీవో  నెంబరు 317ను సవరించాలని బీజేపీ పట్టణ  అధ్యక్షుడు సాముల నాగరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు ముందు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా  నాగరాజు మాట్లాడుతూ ఎలాంటి ప్రామాణికాలు లేకుండా స్థానికతను, సీనియారిటీని నిర్దారిస్తూ ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం సరైంది కాదన్నారు. ఇలాంటి చర్యలతో మనస్తాపానికి గురై ఒక ఉపాధ్యాయుడు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కుమ్మరిరాజు, బీజేపీ నాయకులు మధు, ఆంజనేయులు, కొంగళిశ్రీకాంత్‌, పిట్టలనరేశ్‌, బాబు, జగదీష్‌, శ్రీని వాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

  

Read more