మహిషాసురమర్ధిని దేవిగా జములమ్మ

ABN , First Publish Date - 2022-10-05T04:47:02+05:30 IST

నడిగడ్డ భక్తుల ఇలవేల్పు జము లమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగ రంగవైభవంగా జరగుతున్నాయి.

మహిషాసురమర్ధిని దేవిగా జములమ్మ
జములమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులను సత్కరిస్తున్న ఆలయ చైర్మన్‌ సతీష్‌

గద్వాల, అక్టోబరు 4: నడిగడ్డ భక్తుల ఇలవేల్పు జములమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగ రంగవైభవంగా జరగుతున్నాయి. మంగళవారం అమ్మ వారు మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో భక్తుల కు దర్శనం ఇచ్చారు. వారాంతం కావడంతో దా దాపు 20వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అ మ్మవారిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి దంపతులు ద ర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ చైర్మన్‌ స త్కరించి తీర్థ ప్రసాదాల ను అందించారు. అనంత రం  భక్తులకు అన్నదానం చేశారు.  

ఆలయంలో చండీహోమం  

కాగా జములమ్మ ఆలయంలో చండీహోమం నిర్వహించారు. గద్వాల మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ దంపతులు  హోమం చేశారు. అంతకు ముందు చైర్మన్‌ దం పతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని ఆలయ చైర్మన్‌ సతీష్‌, ఈవో కవిత సత్కరించారు.

- గద్వాలటౌన్‌: గద్వాల పట్టణంలోని  బీరెల్లి రోడ్డు తాయమ్మ ఆలయం, కుమ్మరి సంఘం మం డపం, అన్నపూర్ణేశ్వరి ఆలయం, పాండురంగ ఆలయం, వాసవీ క న్యకాపరమేశ్వరి ఆలయాల్లో మ హిషాసురమర్ధినిగా  అ మ్మవారు పూజలందుకు న్నారు. మార్కండేయ స్వామి ఆలయంలో అంబాభవానిగా,  భద్రకా ళిసమేత వీరభద్ర స్వామి ఆలయంలో ఆలయంలో  మహాసరస్వతీ దేవిగా అ మ్మవారు కొలువయ్యారు.  న వరాత్రి ఉత్సవాల చివరిరోజు కా వడంతో బీరెల్లిరోడ్డు తాయమ్మ గుడి వద్ద ఆలూరు ప్రకాష్‌ గౌడ్‌ దాతగా, 19వార్డు మండపంలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కృష్ణవేణిరామాంజనేయులు దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.  అన్నపూర్ణేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి ప్రత్యేక పూజలు చేశారు.  

- వడ్డేపల్లి : దేవీ శరన్నవాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు మంగళవారం నవమిని పురస్కరించుకు ని  పట్టణంలోని పలు ఆల యాల్లో  అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాం తినగర్‌ రామాలయం ఆల యంలో ఏర్పాటు చేసిన దుర్గ మ్మ మండపంలో  అలంపూ ర్‌ ఎమ్మెల్యే అబ్రహాం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కా ర్యక్రమంలో  ఆలయ వ్యవ స్థాపకుడు పూర్ణచంద్రా రావు, శ్రీనివాసులు, భాస్కర్‌రావు, ప్రభాకర్‌ రావు, వెంకటనారా యణ, శివ పాల్గొన్నారు.  అలాగే పైపాడు గ్రామంలో వాల్మీకి గుడి వద్ద  ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారు మహిషాసురమర్ధిని అలంకరణలో దర్శినమించారు.  Read more