వానొచ్చె.. వరదొచ్చె..

ABN , First Publish Date - 2022-07-06T05:10:27+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వర్షం కురి సింది. పాలమూరు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో రహదారు లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

వానొచ్చె.. వరదొచ్చె..
జడ్చర్ల సిగ్నల్‌ గడ్డ నుంచి నేతాజీ చౌక్‌ ప్రధాన రహదారి గుండా ప్రవహిస్తున్న వరద నీరు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన 

జడ్చర్లలో రహదారులు జలమయం


మహబూబ్‌నగర్‌/గద్వాల/నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 5: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వర్షం కురి సింది. పాలమూరు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో రహదారు లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెద్ద చెరువు అభివృద్ధి పనులు జరుగుతుండటంతో చెరువులోకి వచ్చే వరద నీటిని కాలువలు, అలుగుల నుంచి బయటకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. దాంతో బీకేరెడ్డి కాలనీ, రామయ్యబౌళి లోతట్టు ప్రాంతాలకు నీరు చేరింది. మురుగు నీరు ఇళ్లలోకి చేరి దుర్గంధం వెలువుడుతోందని కాలనీల ప్రజలు వాపోతున్నారు. జడ్చర్లలో ఆరు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో జన జీవనం స్తం భించింది. మూసపేటలోనూ భారీ వర్షం కురిసింది. భూత్పూర్‌, రాజపూర్‌, దేవరకద్ర, నవాబ్‌పేట మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. వర్షంతో వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి. వర్షం, గాలి దుమారం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తెరిపి ఇస్తూ వర్షం కురిసింది. అలంపూర్‌లో 33 మిల్లీ మీటర్లు, వడ్డేపల్లిలో 29, రాజోలిలో 27, ఉండవెల్లిలో 22, అయిజ, ధరూర్‌లో 17 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వర్షానికి గద్వాల పట్టణంలో రోడ్లు చిత్తడిగా మారాయి. ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్‌లో నీళ్లు నిలువడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నారా యణపేట జిల్లా దామరగిద్దలో 2 మీల్లీ మీటర్లు, కోస్గిలో 1.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ మండలంలో అత్యధికంగా 41.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఉర్కొండలో 1.3, కల్వకుర్తిలో 1, తిమ్మాజిపేటలో 0.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది.

Read more