పెంచిన ఆర్టీసీ బస్‌ చార్జీలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-06-12T05:08:24+05:30 IST

గడిచిన రెండు నెలల్లో రెండుసార్లు ఆర్టీసీ బస్‌చార్జీలు పెంచి ప్రయాణి కులపై మోయలేని భారాలు మోపారని సీపీఎం పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ అన్నారు.

పెంచిన ఆర్టీసీ బస్‌ చార్జీలు తగ్గించాలి
తూంకుంటలో రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు

- సీపీఎం పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ

- చార్జీల పెంపును వ్యతిరేకిస్తు సీపీఎం, పీడీఎస్‌యూ వేర్వేరుగా నిరసన


వనపర్తి టౌన్‌, జూన్‌ 11: గడిచిన రెండు నెలల్లో రెండుసార్లు ఆర్టీసీ  బస్‌చార్జీలు పెంచి ప్రయాణి కులపై మోయలేని భారాలు మోపారని సీపీఎం పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సీపీఎం, ఆర్టీసీ డిపో ముందు పీడీఎస్‌యూ నాయకులు వేర్వే రుగా చార్జీల పెంపును వ్యతిరేకిస్తు నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ సా మాన్య ప్రజానీకం ఇప్పటికే ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే తాజా గా ఆర్టీసీ చార్జీల విషయంలో ఏకంగా రెండు నెలల్లో రెండు సార్లు చార్జీలు పెంచి ప్రజలపై పిడుగు వేయ డం దుర్మార్గమన్నారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గణేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లను ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ హామీకి విరుద్దంగా బస్‌పాస్‌ చార్జీలు పెంచారని అన్నారు. రూ.165 ఉన్న బస్‌పాస్‌ నేడు రూ.450కి పెంచారని మండిపడ్డారు. పెంచిన ఆర్టీసీ బస్‌చార్జీలు, విద్యా ర్థుల బస్‌పాస్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని డి మాండ్‌ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు రమేష్‌, మదన్‌, పరమేశ్వరాచారి, బాలస్వామి, బాలరాజు, రాబర్ట్‌, గట్టయ్య, బీసన్న, సా యిలీల, మన్నెం, ఎత్తంరమేష్‌, బంకలి కురుమయ్య, కురుమూర్తిగౌడ్‌, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి వెంక టేష్‌, అశోక్‌, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. 

పాన్‌గల్‌ : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెంచిన ఆర్టీసీ బస్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని తెల్లరాళ్ళపల్లి తండా, రేమద్దుల గ్రామంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దేవేందర్‌, బాల్యనాయక్‌ల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌, బస్‌చార్జీలతో పాటు, నిత్యా వసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీ ఎం మండల కమిటీ సభ్యులు జమ్ములమ్మ, వెంక టయ్య, గిరిజన సంఘం జిల్లా నాయకులు బాబు నాయక్‌, సోమ్లానాయక్‌ తదితరులున్నారు.

వీపనగండ్ల : పెంచిన ఆర్టీసీ బస్‌చార్జీలను తగ్గించాలని డిమాండ్‌  చేస్తూ మండలంలోని తూం కుంట గ్రామంలో శనివారం గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించడం తో బస్సులు నిలిచిపోయాయి. కరోనా సమయంలో రద్దు చేసిన బస్సులను పునరుద్ధరించాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ యువకులు శ్రీకాంత్‌, నరేష్‌గౌడ్‌, ప్రేమ్‌ కుమార్‌, సాయి తదితరులు కోరారు. 

Read more