-
-
Home » Telangana » Mahbubnagar » India should make the Jodo Yatra a success-MRGS-Telangana
-
భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-10-12T04:41:17+05:30 IST
రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌జోడో యాత్రను విజయవం తం చేసేందుకు ప్రతీ యువజన కాంగ్రెస్ కార్యకర్త క్రియాశీలకంగా పని చేయాలని యువజన కాం గ్రెస్ జాతీయ కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు.

- యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రమేశ్ బాబు
మహబూబ్‌నగర్, అక్టోబరు 11 : రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌జోడో యాత్రను విజయవం తం చేసేందుకు ప్రతీ యువజన కాంగ్రెస్ కార్యకర్త క్రియాశీలకంగా పని చేయాలని యువజన కాం గ్రెస్ జాతీయ కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాత్రలో యువజన కాంగ్రెస్ శ్రేణులంతా భాగ స్వామ్యం కావాలన్నారు. ప్రతీ గ్రామంలో యాత్ర విజయవంతానికి సంఘం గ్రామ అధ్యక్షులను ని యమించాలని సూచించారు. ప్రతీగ్రామం నుంచి యువత తరలివచ్చేలా చూడాల్సిన బాధ్యత యువ జన కాంగ్రెస్‌పై ఉందన్నారు. జిల్లాలో విజయవం తంగా యాత్రసాగేలా శ్రేణులను సన్నద్ధం చేయా లన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాసు యాదవ్, ప్రధాన కార్యదర్శి అబ్దు ల్ హక్, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు జే. చం ద్రశేఖర్, నాయకులు రాఘవేందర్ గౌడ్, శ్రీశైలం, శ్రీహరి నాయక్, నాగరాజు, వెంకట్ పాల్గొన్నారు.