భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-12T04:30:38+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కోరారు.

భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలి
మక్తల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న చిన్నారెడ్డి; చిత్రంలో మల్లురవి, సంతప్‌కుమార్‌

టీపీసీసీ నాయకులు మల్లు రవి, చిన్నారెడ్డి, సంపత్‌



నారాయణపేట, అక్టోబరు 11: కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కోరారు. మంగళవారం నారాయణపేట సీవీఆర్‌ బంగ్లాలో యాత్ర సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఈ నెల 23న యాత్ర నారాయణపేట జిల్లాలో ప్రవేశిస్తుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొనేలా చూడాలని అన్నారు. నియోజకవర్గం నుంచి 25 వేల మందికి తగ్గకుండా శ్రేణులు పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశించారన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టార న్నారు. దేశంలో మతచిచ్చు పెట్టి, దేశాన్ని విభజించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అంతం చేసేందుకు రాహుల్‌ గాంధీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈనెల 15న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఉమ్మడి జిల్లాలో యాత్ర సన్నాహక సమావేశం ఉంటుం దన్నారు. టీపీసీసీ సభ్యునిగా చిట్టెం అభిజయ్‌రెడ్డిని నియమించినట్లు మల్లురవి ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికల్లో టీపీసీసీ సభ్యులు మల్లికార్జున్‌ ఖర్గేకు ఓటేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్‌, జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, చిట్టెం అభిజయ్‌రెడ్డి, సంజీవ్‌, ఎండీ గౌస్‌ పాల్గొన్నారు.



3 లక్షల మందితో స్వాగతం

మక్తల్‌ రూరల్‌: తెలంగాణలోకి ఈ నెల 23న రానున్న కాంగ్రెస్‌ అధి నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కోరారు. మంగళవారం మక్తల్‌ పట్టణ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ మండలం కృష్ణ బ్రిడ్జి దగ్గర నుంచి ప్రారంభ మౌతుందన్నారు. టైరోడ్డు వద్ద బహిరంగ సభ ఉంటుందన్నారు. మూడు లక్షల మందితో స్వాగ తం పలకాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-12T04:30:38+05:30 IST