చివరకు న్యాయమే గెలిచింది

ABN , First Publish Date - 2022-12-06T23:08:16+05:30 IST

తెలకపల్లి జడ్పీటీసీ ఎన్నిక విషయం లో చివరకు న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు.

  చివరకు న్యాయమే గెలిచింది
జడ్పీ కార్యాలయ ఆవరణంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి

- మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, డిసెంబరు 6: తెలకపల్లి జడ్పీటీసీ ఎన్నిక విషయం లో చివరకు న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో తెలకపల్లి జడ్పీటీసీ గా కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎన్‌.సుమిత్ర ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన కార్యక్రమం అనంతరం జడ్పీ ఆవరణంలో మీడియాతో మాట్లాడారు. మూడేళ్ల న్యాయ పోరాటంలో విజయం సాధించి తెలకపల్లి జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన సుమిత్ర న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పని చేసి ప్రజల్లో మన్ననలు పొందాలని కోరారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యులు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, తన మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రా జెక్టుల్లో కేసీఆర్‌ ప్రభుత్వం లేనిది ఉన్నట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్య పెట్టే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేప ట్టిన పాలమూరు రంగారెడ్డ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోగా కేఎల్‌ఐ కింద డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేకుండా చెరువులు, కుంటలు నింపి గొప్పలు చెప్పుకొంటోందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీ జేపీలు లిక్కర్‌, ఫాంహౌస్‌ కేసుల్లో పెట్టుకుని ఒకరినొకరు విమర్శించుకుంటూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ది కావాలంటే రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు బుద్ది చెప్పి ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నాగం కోరారు. కాంగ్రెస్‌ జడ్పీటీసీలు కేవీఎన్‌ రెడ్డి, రోహిణిరెడ్డి, ఎన్‌.సుమిత్ర, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్ధం రవి, కౌన్సిలర్లు సురేంద్ర, సుల్తాన్‌, నిజాముద్దీన్‌, నాయకులు నాగం శశీధర్‌రెడ్డి, పాండు, లక్ష్మయ్య, నారాయణగౌడ్‌, అర్జునయ్య, బాలగౌడ్‌, తిరుపతిరెడ్డి, సలీం, సీంతోష్‌, శ్రీనివాసులు, పర్వతాలు, విజయ్‌కుమార్‌, భీముడు, హైమద్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలకపల్లిలో సంబురాలు

తెలకపల్లి: జడ్పీటీసీగా కాంగ్రెస్‌ అభ్యర్థి సుమిత్ర ఎన్నిక కావడం పట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పట్టణ ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సుమిత్ర అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌ సురేఖ, మండల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:08:17+05:30 IST