అనుమతుల పేరుతో ఇసుక అక్రమ దందా

ABN , First Publish Date - 2022-03-04T05:36:44+05:30 IST

అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో జిల్లా లో పట్టపగలు ఇసుక అక్రమ రవాణా జరుగు తోంది.

అనుమతుల పేరుతో ఇసుక అక్రమ దందా
రాంపురం పుష్కరఘాట్‌

- రాంపూర్‌ పుష్కర ఘాట్‌ వద్ద పట్టపగలు ఇసుక జాతర 

- 50 నుంచి 60 ట్రాక్టర్లతో రవాణా 


వనపర్తి రూరల్‌, మార్చి 3:  అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో జిల్లా లో పట్టపగలు ఇసుక అక్రమ రవాణా జరుగు తోంది. ఒక ట్రాక్టర్‌కు అనుమతి ఉండగా మూడు నుంచి నాలుగు వాహనాలతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇసుక వాహనా లకు అనుమతి ఇవ్వడంతో దీనిని ఆసరా చేసు కుని మాఫియా అక్రమ రవాణాకు పాల్పడు తోంది. వనపర్తి మండలంలోని గుర్రంగడ్డ వాగు, రాంపురం పుష్కర ఘాట్‌ వద్ద ఉన్న ఇసుక రీచ్‌ నుంచి వందలాది ట్రాక్టర్లు అక్రమ రవాణా చేస్తు న్నారు. గతేడాది గుర్రంగడ్డ వాగు వద్ద వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు భారీ ఎత్తున ఇసుకను తరలించి వాగును ఖాళీ చేశారు. ఈ ఏడాది వర్షా లు వచ్చినా వరదల వల్ల ఇసుక మేటలు పెట్టిం ది. వాగు ద్వారా అక్రమంగా తరలించిన ఇసుక ను ఒకచోట డంప్‌ చేసి రాత్రివేళ టిప్పర్ల ద్వారా గద్వాల, వనపర్తి తదితర ప్రాంతాలకు అక్రమం గా తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇసుక అనుమతులను సోమ, గురు, శనివారాలలో ఇస్తు న్నారు. గురువారం తహసీల్దార్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌లు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం 23 ట్రాకర్ల కు అనుమతులు ఇచ్చారు. అనుమతుల సాకుతో అక్రమ ఇసుక దందా జోరుగా జరుగుతోంది. గురువారం అనుమతులు రాకముందే ఇసుక ట్రా క్టర్లు లోడ్‌ చేసుకుని రహదారిపై అనుమతుల కో సం వేచి ఉన్నాయి. అనుమతులు వచ్చిన వెం టనే అతివేగంగా రెండు, మూడు ట్రిప్పులు చేస్తు న్నారు. రాంపురం పుష్కరఘాట్‌ వద్ద రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఉన్నా అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నారు. పెబ్బేరు నుంచి వనపర్తి వెళ్లే ట్రాక్టర్లు అతివేగంగా ఇసుకను రవాణా చేస్తు మిగతా వాహనదారులు, ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.  

Read more